Indian Railways Record: రైల్వే మంత్రిత్వ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. "లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్"లో దాని పేరు మీద కొత్త రికార్డును నమోదు చేసుకుంది. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రజా సేవా కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అత్యధిక మంది హాజరయ్యారు. ఇది వర్చువల్ ప్రోగ్రామ్, దీనిలో చాలా మంది ప్రజలు పాల్గొనడం రికార్డ్‌గా మారింది. 704 కోట్ల రూపాయలతో తూర్పు రైల్వేకు చెందిన 28 స్టేషన్లకు ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2,140 వేర్వేరు ప్రదేశాల్లో 40,19,516 మంది పాల్గొన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల ప్రారంభోత్సవం, రైల్వే స్టేషన్‌లకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈరోజు భారత్ ఏది చేసినా అది అపూర్వమైన వేగంతో చేస్తుందన్నారు. భారతదేశం ఇకపై చిన్న కలలు కనదు, కానీ పెద్ద కలలు కనడానికి పగలు రాత్రి కష్టపడుతుంది అని ప్రధాని పేర్కొన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ "ప్రజా సేవ కార్యక్రమంలో ఎక్కువ మంది వ్యక్తులు - బహుళ వేదికల" కోసం "లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్"లో స్థానం సంపాదించింది.
"లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్" అంటే ఏమిటి?
Indian Railways Record: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది లిమ్కా బ్రాండ్ ఇచ్చే ఒక ఉన్నతమైన సర్టిఫికెట్. ఇది 1990లో భారతదేశంలో ప్రారంభించారు. ఈ పుస్తకంలో హద్దులు, పరిమితులు దాటి అసాధారణ విజయాలు సాధించిన వ్యక్తుల/సంస్థల రికార్డులకు గుర్తింపు లభిస్తుంది. ఈ పుస్తకం రికార్డ్ హోల్డర్ల అద్వితీయ విజయాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. వారి జీవితంలో సామాన్యులకు భిన్నంగా ఏదైనా చేయాలనుకునే వ్యక్తులకు సెల్యూట్ చేస్తుంది.
Also Record: ఎక్స్ ప్లాట్ ఫాంలో కీలక మార్పులు!
ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్
Indian Railways Record: భారతదేశంలో ప్రతిరోజూ రైలులో ప్రయాణించే వారి సంఖ్య కంటే ఆస్ట్రేలియా జనాభాసంఖ్య చాలా తక్కువ. ఈ లెక్కతో భారతీయ రైల్వేల నెట్‌వర్క్‌ను అంచనా వేయవచ్చు. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ సుమారు మూడు కోట్ల మంది ప్రయాణిస్తుండగా, ఆస్ట్రేలియా జనాభా 2.75 కోట్లు. అంటే ప్రతిరోజూ ఆస్ట్రేలియా దేశంలో ఉన్నంత జనాభా కంటే ఎక్కువగా మన రైల్వేల్లో ప్రయాణాలు చేస్తున్నారు. భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. భారత్ కంటే ముందు రష్యా మూడో స్థానంలో, చైనా రెండో స్థానంలో, అమెరికా రైల్ నెట్‌వర్క్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ రైలు నెట్‌వర్క్‌లో 7 వేలకు పైగా రైల్వే స్టేషన్‌లు, పదమూడు వేలకు పైగా ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.