మోడీ నాయకత్వంలోనే ఇండియన్ రైల్వే అభివృద్ధి: కిషన్ రెడ్డి

2014 నుంచి 2023కి రైల్వే శాఖ బడ్జెట్ కు 17రేట్లు పెరిగిందన్నారు. రైల్వే అభివృద్ధి కోసం 30వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 20వేల కోట్ల నిధులు రైల్వే పనుల కోసం కేంద్రం ఖర్చు చేసిందని, 122 కిలో మీటర్ల కొత్త రైల్ లైన్స్ నిర్మించిందని చెప్పారు. 2023 పూర్తి అయ్యే వరకు తెలంగాణలోని అన్ని రైల్వే లైన్స్ ను ఎలక్ట్రిక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని..

New Update
మోడీ నాయకత్వంలోనే ఇండియన్ రైల్వే అభివృద్ధి: కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ నాయకత్వంలోనే ఇండియన్ రైల్వే అభివృద్ధి చెందిందన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మోడీ కారణంగానే రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయని కొనియాడారు. 2014 నుంచి 2023కి రైల్వే శాఖ బడ్జెట్ కు 17రేట్లు పెరిగిందన్నారు. రైల్వే అభివృద్ధి కోసం 30వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 20వేల కోట్ల నిధులు రైల్వే పనుల కోసం కేంద్రం ఖర్చు చేసిందని, 122 కిలో మీటర్ల కొత్త రైల్ లైన్స్ నిర్మించిందని చెప్పారు. 2023 పూర్తి అయ్యే వరకు తెలంగాణలోని అన్ని రైల్వే లైన్స్ ను ఎలక్ట్రిక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని వెల్లడించారు కిషన్ రెడ్డి.

రెండు వేలకు పైగా రైల్వే లైన్స్ కోసం తెలంగాణలో సర్వేలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. రైల్వేలో ప్రయాణికుల భద్రత కోసం అండర్ బ్రిడ్జ్ ల నిర్మాణం చేస్తున్నామని.. హైదరాబాద్ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటీఎస్ ను 3 వందల కోట్లతో నిర్మించబోతున్నామని చెప్పారు. సికింద్రాబాద్ లో అభివృద్ధి పనుల కోసం ఏడు వందల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 2024 లోపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

దీనికి 2 వందల కోట్లు కేంద్రం ఇచ్చిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. మరో 3 వందల కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుందన్నారు. రైల్వే మ్యాన్యుఫ్యాక్చర్ యూనిట్ లో దశల వారిగా అభివృద్ధి నిర్ణయాలు ఉంటాయన్నారు. కాజీపేట రైల్వే మ్యాన్యుఫ్యాక్చర్ యూనిట్ లో 3వేల మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. దేశంలో అత్యంత సేఫ్ జర్నీ రైల్వే ప్రయాణం.. 25 వేల కోట్లతో 508 రైల్వే స్టేషన్స్ పునరుద్ధరణ పనులు మోడీ ప్రారంభిస్తారు అన్నారు.

26 వేల కోట్లతో RRR రోడ్డు కేంద్రం పరిధిలో పనులు ప్రారంభించిందని, ట్రిపుల్ ఆర్ పరిధిలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు కూడా రాబోతుందన్నారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం భూమి సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని విమర్శించారు. RRR నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకారం కేంద్రానికి లేదు.. భూ సేకరణలో కేంద్రం పాలు పంచుకొని సగం నిధులు ఇస్తానని ముందుకు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేయడం లేదని ఆరోపించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

మరోవైపు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బీజేపీ ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ అండగానే ఉంటూ వస్తోందని, రానున్న రోజుల్లో కార్మికులకు మరింత అండగా ఉంటామని చెప్పారు. ఆర్టీసీ విలీనం విషయంలో తమ పార్టీని బద్నాం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆర్టీసీకి వేల ఎకరాల భూములు ఉన్నాయని, ఆ భూములను అమ్మేందుకే కేసీఆర్ ఈ డ్రామాలాడుతున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు