ఐఆర్‌సీటీసీ సర్వర్ లోపంతో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్, అప్లికేషన్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే ఫ్యాసెంజర్స్ మంగళవారం(25-07-2023) సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు.ఇండియన్ రైల్వేస్ యొక్క ఇ-టికెటింగ్ విభాగం IRCTC అందుబాటులో లేకపోవడానికి సాంకేతిక కారణాలే కారణమని ఇండియన్ రైల్వే పేర్కొంది.

IRCTC:ట్రైన్ బుకింగ్‌లో అదిరిపోయే ఫీచర్..అదిరిపోయింది గురూ
New Update

indian-railway-irctc-down-users-get-error-message-while-booking-train-tickets

IRCTC సైట్, యాప్‌లో టికెటింగ్ సేవ(Ticket Service) అందుబాటులో లేదు.CRIS (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) సాంకేతిక బృందం సమస్యను పరిష్కరిస్తోందని ట్వీట్‌లో(Tweet) పేర్కొంది.యాప్ మరియు సైట్ డౌన్ అయ్యే వరకు ప్రజలు అమెజాన్(Amazon), మేక్‌మైట్రిప్(Make My Trip) వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తమ టిక్కెట్‌లను బుక్(Book) చేసుకోవచ్చని IRCTC తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే(Bharath Railway) దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని పలు రైల్వే స్టేషన్లలో అదనపు కౌంటర్లను (Counters) తెరిచింది.

పరిస్థితిని సమీక్షిస్తున్న IRCTC

ఇది సాధారణ PRS (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) టిక్కెట్ విండోలకు(Ticket Window) అదనం.పరిస్థితిని సమీక్షించి తర్వాత మరిన్ని కౌంటర్లను తెరుస్తామని కూడా తెలిపింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రెండు అదనపు PRS టిక్కెట్ విండోలు ఉండగా, ఓఖ్లా, నిజాముద్దీన్, షాహదారా మరియు సరోజినీ నగర్ స్టేషన్లలో ఒక్కొక్కటి PRS టిక్కెట్ విండోను కలిగి ఉంది.వెబ్‌సైట్ పూర్తిగా పని చేసే వరకు IRCTC ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తోంది.

IRCTC వెబ్‌సైట్‌ సాంకేతిక లోపం

రైల్వేశాఖ ఇచ్చిన సమాచారం మేరకు IRCTC వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం(Technical Issue) కారణంగా పే చేసిన డబ్బు(Money) నిలిచిపోయిన ప్రయాణికుల డబ్బును వాపసు (Return) చేయనున్నట్లు రైల్వే తెలిపింది.మరోవైపు ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో కౌంటర్ల కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.అక్కడ నుంచి వారు బుకింగ్ చేసుకోవచ్చు.గతంలోనూ మే 6న ఐఆర్‌సీటీసీ సేవలు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురిఅయ్యారు. ఇప్పుడు పునరుద్దరించడంతో ప్రయాణికులు యథావిధిగా టికెట్లను బుకింగ్(Ticket Booking) చేసుకోవచ్చు.

#indian-railways #irctc #technical-issue
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe