JOBS: ఇండియన్ ఆయిల్ లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. హ్యూమన్ రిసోర్స్, ఎలక్ట్రికల్, T&I, అకౌంట్స్/ఫైనాన్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో సహా వివిధ ట్రేడ్‌లలో 473 అప్రెంటీస్ ఖాళీల భర్తీకీ దరఖాస్తులు కోరింది. ఫిబ్రవరి1 అన్ లైన్ అప్లికేషన్ చివరితేది. By srinivas 22 Jan 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి IOCL Recruitment 2024: నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) తీపి కబురు అందించింది. తమ కంపెనీలో ఖాళీగా ఉన్న వివిధ ట్రేడ్‌ల అప్రెంటీస్ ఖాళీలను భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టులను అనుసరించి టెన్త్ తోపాటు వివిధ సబ్జెక్టులవారిగా డిగ్రీ పాసైన వారు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు హ్యూమన్ రిసోర్స్, ఎలక్ట్రికల్, T&I, అకౌంట్స్/ఫైనాన్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో సహా వివిధ ట్రేడ్‌లలో 473 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయానుంది. ప్రతి ట్రేడ్‌లోని పోస్ట్‌కు అవసరమైన విద్యార్హతలు భిన్నంగా ఉన్నాయి. టెన్త్ అర్హతతోపాటు డిప్లోమా, ఐటీఐ, ఇంజనీరింగ్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొంది. ఆన్‌లైన్ దరఖాస్తు : ఆసక్తిగల అభ్యర్థులు 2024 ఫిబ్రవరి 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వయో పరిమితి : 2024 జనవరి 12 నాటికి కనీస వయో పరిమితిని 18 సంవత్సరాలు నుంచి గరిష్ట వయోపరిమితి 24 సంవత్సరాలుగా నిర్ణయించింది. అంతేకాకుండా రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఇది కూడా చదవండి : Ayodhya : అయోధ్య వేడుకకు రాని జూ.ఎన్టీయార్ మరికొందరు… రాత పరీక్ష : ఆబ్జెక్టివ్ పద్ధతిలో 100 మార్కుల పరీక్షలు నిర్వహించనున్నారు. ఎగ్జామ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏప్రిల్ లేదా మేలో నిర్వహించే అవకాశం ఉంది. అప్రెంటిస్‌షిప్ శిక్షణ : అభ్యర్థులు 12 నెలల పాటు అప్రెంటిస్‌షిప్ కోసం శిక్షణ పొందుతారు. ఎంపికైన అప్రెంటీస్‌లు అప్రెంటీస్ చట్టం, 1961/1973 /అప్రెంటీస్ రూల్స్ 1992 (సవరించినట్లు) అండ్ కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం అప్రెంటీస్‌లకు నెలకు చెల్లించాల్సిన విధంగా స్టైపెండ్ చెల్లించనున్నారు. Notification PDF మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ : iocl.com #iocl-recruitment #latest-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి