Metro : దుస్తులు మురికిగా ఉన్నాయంటూ.. రైతును మెట్రో ఎక్కనివ్వని సిబ్బంది!

మెట్రో రైలు ఎక్కడానికి వచ్చిన ఓ రైతును బెంగళూరు మెట్రో సెక్యూరిటీ సూపర్‌ వైజర్‌ అడ్డుకున్నాడు. దుస్తులు మురికిగా ఉన్నాయని, అతను రైలు లోపలికి ఎక్కితే తోటి ప్రయాణికులు చిరాకు పడతారని సమాధానం ఇవ్వడంతో ఓ యువకుడు కలగజేసుకుని గొడవకు దిగడంతో రైతుని మెట్రో ఎక్కనిచ్చారు.

New Update
Metro : దుస్తులు మురికిగా ఉన్నాయంటూ.. రైతును మెట్రో ఎక్కనివ్వని సిబ్బంది!

Farmer In Metro : పది మందికి అన్నం పెట్టే రైతన్న.. పొద్దు మొదలైనప్పటి నుంచి పొద్దు పొడిచే వరకు పొలంలో ఉంటూ నిత్యం కష్టపడుతుంటాడు. ఈ క్రమంలో దుస్తులన్ని దుమ్ము కొట్టుకుపోయి మురికిగా మారతాడు. అలాంటి ఓ రైతన్న(Farmer) మెట్రో ట్రైన్‌(Metro Train) ఎక్కడానికి వస్తే మీ బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రో ఎక్కడానికి సిబ్బంది అడ్డుపడ్డారు.

దీంతో మరో తోటి ప్రయాణికుడు కలగజేసుకుని వారితో వాగ్వాదానికి దిగడంతో వెనక్కి తగ్గిన సిబ్బంది ఆ రైతును మెట్రోలోనికి అనుమతించారు. ఈ ఘటన బెంగళూరు మెట్రో స్టేషన్‌(Bangalore Metro Station) లో జరిగింది.

బెంగళూరులోని రాజాజీనగర్‌ మెట్రో స్టేషన్(Rajajinagar Metro Station) లో రైలు ఎక్కడానికి ఓ రైతు తల మీద ఓ సంచి పెట్టుకుని వచ్చాడు. అతన్ని చూసిన మెట్రో సెక్యూరిటీ సూపర్‌ వైజర్‌ ట్రైన్‌ ఎక్కడానికి వీలు లేదు అంటూ అతన్ని అడ్డుకున్నాడు. దీంతో మరో తోటి ప్రయాణికుడు కలగజేసుకున్నాడు. ఆ రైతుని ఎందుకు అడ్డుకుంటున్నారని సిబ్బందిని ప్రశ్నించాడు.

అతని దుస్తులు మురికిగా ఉన్నాయని, దీని వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారని మెట్రో ఎక్కేందుకు అనుమతించమని కొంచెం కటువుగా సమాధానమిచ్చాడు. దీంతో సదరు యువకుడు బెంగళూరు మెట్రో వీఐపీలకు మాత్రమేనా.. లేక అందరికోసమా అంటూ ప్రశ్నించాడు.

కేవలం దుస్తులను బట్టి మెట్రోలో ప్రయాణం చేసేందుకు అనుమతి అంటూ రాతపూర్వకంగా ఓ లేఖను రాసి ఇవ్వమని సదరు యువకుడు గట్టిగా నిలదీసే సరికి సెక్యూరిటీ సిబ్బంది ఏమి మాట్లాడలేదు. తరువాత రైతును మెట్రో ఎక్కేందుకు అధికారులు అనుమతిచ్చారు. ఈ విషయం గురించి తెలుసుకున్న బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సెక్యూరిటీ సూపర్‌ వైజర్‌ ను సస్పెండ్‌ చేసింది.

రైతు పక్షాన నిలబడి అధికారులతో వాగ్వాదానికి దిగిన యువకుడి పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌ గా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Government) ఆరాచకాలకు ఈ ఘటనే నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు. పేదల ఓట్లు అయితే కావాలి కానీ.. వారిని రైలు ఎక్కనివ్వరా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read :  మీరు ఇస్తారా..మమ్మల్నే చేయమంటారా .? కోస్ట్‌ గార్డ్ లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు పై సుప్రీం సీరియస్‌!

Advertisment
తాజా కథనాలు