Indian Election History Explained: స్వాతంత్య్రానికి ముందు ఎన్నికలు ఎలా జరిగాయి అనే ప్రశ్న మీ మనసులో చాలా సార్లు వచ్చి ఉంటుంది కదా.? 1909లో ఎన్నికల చట్టం ఆమోదించిన తర్వాత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో ఓటరు జాబితాలో హిందూ, ముస్లిం ఓటర్లు కలిపి 50 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. అకాడమీలో గుర్తించిన ఓటరు జాబితాలో 50 మందిలో 19 మంది హిందువులు ఉన్నారు.. మిగిలిన వారు ముస్లింలు. అదే సమయంలో, 1945లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓటరు జాబితాలో కేవలం ముస్లిం ఓటర్లే ఉన్నారు.
68 దశల్లో పోలింగ్:
1909లో 50 మందికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఈ 50 మంది ప్రజలు ఈ ప్రాంతానికి పెద్దలు, భూస్వాములు, పెద్ద వడ్డీ వ్యాపారులు, పెద్ద రైతులు. అంటే పన్నులు కట్టిన వారికే ఓటు హక్కు ఉండేది. ఇక 1947లో స్వాతంత్ర్యం వచ్చిన 4 ఏళ్ల తర్వాత భారత్‌లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 1951 నుంచి ఫిబ్రవరి 1952 మధ్య ఎన్నికలు జరిగాయి. 68 దశల్లో ఈ పోలింగ్ జరిగింది. 489 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఈ పోటిలో 364 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
ఈవీఎంల ఎంట్రీ:
1982లో కేరళలో జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్-EVMని ఉపయోగించారు. ఇక 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. ఇక ఎన్నికల సమయంలో ఓటర్‌కు తమ నియోజకవర్గంలోని ఏ అభ్యర్థి నచ్చకపోతే NOTA ఆప్షన్‌ను 2013లో తీసుకొచ్చారు. 2013లో ఛత్తీస్‌గఢ్, మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మొదటిసారిగా నోటా ఆప్షన్‌ను ప్రవేశపెట్టాయి. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ దీని కోసం చిహ్నాన్ని రూపొందించింది.
భారీగా పెరిగిన ఖర్చు:
ఇక ఖర్చు విషయానికి వస్తే తొలి సార్వత్రిక ఎన్నికలకు దాదాపు రూ.10.5 కోట్లు ఖర్చు చేశారు. ఆ సమయంలో దేశంలో నేటికి ఉన్నన్ని వనరులు అందుబాటులో లేవు. 1957 సార్వత్రిక ఎన్నికలు మినహా, ప్రతి లోక్‌సభ ఎన్నికలపై ఖర్చు పెరిగింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 1,114 కోట్ల రూపాయల ఖర్చు చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ వ్యయం 3,870 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోసం పెట్టుకునే ఖర్చు.. ఇక పార్టీలు ప్రచారం మిగిలిన విషయాలను చూస్తే మైండ్‌బ్లాక్ అవ్వడం పక్కా. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ నివేదిక ప్రకారం 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దాదాపు 55,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. ఇందులో బీజేపీ దాదాపు సగం కంటే ఎక్కువ ఖర్చు చేసింది.
ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఒకప్పుడు పెద్ద తలనొప్పిగా అనిపించేది. సమీపంలోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఓటర్ల జాబితా విడుదలైనప్పుడు అందులో పేరుంటే ఓటు హక్కు వచ్చినట్టు తెలిసేది! ఇదంతా గతం.. ఇప్పుడు ఎన్నికల సంఘం టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది.
రికార్డు స్థాయిలో ఓటర్లు నమోదు:
ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, ఎరోనెట్, సి–విజిల్ యాప్, అబ్జర్వర్ యాప్, క్యాండిడేట్ నామినేషన్ యాప్ లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇక ఓటర్ జాబితాలో కచ్చితత్వానికి వీలుగా ఓటర్ల ఎంపికలో ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని ఈసీ 2022లో చేపట్టింది. ఇలా ఎన్నో మార్పులతో భారత్ ఎన్నికల చరిత్ర కనిపిస్తోంది.. 1909లో 50మంది ఓటర్లతో మొదలైన భారత్ ఓటు చరిత్ర.. 2024నాటికి 96కోట్ల మంది ఓటర్ల నమోదు వరకు వెళ్లింది.
Also Read: తెలంగాణలో ఎంపీ సీట్లు ఎవరికెన్ని.. రవిప్రకాష్ తో ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారంటే?