R Aswin: నేను ఫుల్ ఎంజాయ్ చేశా..గుంటూరు కారానికి రివ్యూ ఇచ్చిన టీమ్ ఇండియా క్రికెటర్

గుంటూరు కారం చాలా బావుంది అంటున్నాడు టీమ్ ఇండియా బౌలర్ రవిచంద్ర అశ్విన్. నా మాట నమ్మకపోతే మీరే చూసి తెలుసుకోండి అని చెబుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు,తమిళ్, మలయాళం, కన్నడ హిందీలలో ఓటీటీలో ప్రసారం అవుతోంది.

New Update
R Aswin: నేను ఫుల్ ఎంజాయ్ చేశా..గుంటూరు కారానికి రివ్యూ ఇచ్చిన టీమ్ ఇండియా క్రికెటర్

Ashwin About Guntur Kaaram: మహేష్ బాబు, శ్రీలీల హీరోహీరోయిన్లుగా...త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శక్తంలో వచ్చిన మూవీ గుంటూరు కారం. థియేటర్లలో ఈ మూవీ పెద్దగా ఆడకపోయినా..ఓటీటీలో అదరగోడుతోంది. మిగతా భాషల వాళ్ళు కూడా మూవీని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు, శ్రీలీల డాన్స్ పెర్ఫార్మెన్స్ కి విజిల్స్ వేస్తున్నారు. శ్రీలీల డాన్స్ టాలెంట్కు ఫిదా కూడా అయిపోతున్నారు. అలాగే మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, డాన్స్ కూడా బాగుందని మెచ్చుకుంటున్నారు.

ఏం డాన్స్‌ చేశారబ్బా..

గుంటూరు కారం ఓటీటీలో చూసిన టీమ్ ఇండియా క్రికెటర్ రవిచంద్ర అశ్విన్ కూడా ఇదే మాట చెబుతున్నాడు. గుంటూరు కారం సినిమా చూసి నేను ఫుల్ ఎంజాయ్ చేశా అని చెబుతున్నాడు. ఈ మూవీలో సాంగ్స్ కి మహేష్ బాబు, శ్రీలీల అద్భుతంగా డాన్స్ చేశారని పొగిడేస్తున్నాడు. మీరు చూడకపోతే వెంటనే యుట్యూబ్ లో గుంటూరు కారం సాంగ్స్ చూసేయండి.. కచ్చితంగా నచ్చుతుంది అంటూ ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ కి సజిస్ట్ కూడా చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ స్వతహాగా తమిళియన్. దీంతో అతను తెలుగు సినిమాలను బాగానే ఫాలో అవుతుంటాడు. ఇక్కడి స్టార్ హీరోలని కూడా అభిమానిస్తారు. అప్పుడప్పుడు తెలుగు క్రికెటర్స్ తో ముచ్చటించే సమయంలో సినిమాల గురించి ఎక్కువగా రవిచంద్రన్ అశ్విన్ డిస్కషన్ పెడుతూ ఉంటాడని చెబుతుంటారు. గతంలో హనుమ విహారితో మాట్లాడుతూ తెలుగు సినిమాల గురించి చర్చించిన వీడియో వైరల్ కూడా అయ్యింది. ఇప్పుడు గుంటూరు కారం సినిమాపై రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించడం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ అభిమానులు వీడియోని ట్విట్టర్, ఫేస్ బుక్ లో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.

Also Read:Heart Attacks:జబ్బులను ముందే పసిగట్టే రక్తపరీక్ష..అత్యంత తక్కువ ధరకే..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు