ICC Rankings: అదరగొట్టిన టీమిండియా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ప్లేస్..

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియా అదరగొట్టింది. అన్ని ఫార్మాట్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఇప్పటికే టీ20, టెస్టుల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న టీమిండియా.. ఇప్పుడు వన్డేల్లోనూ టాప్‌ ప్లేస్‌కు చేరింది. దాంతో అన్ని ఫార్మట్లలోనూ టాప్ చేరిన దేశంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది టీమిండియా.

New Update
ICC Rankings: అదరగొట్టిన టీమిండియా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ప్లేస్..

Team India Top Place in ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియా(India Cricket Team) అదరగొట్టింది. అన్ని ఫార్మాట్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఇప్పటికే టీ20, టెస్టుల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న టీమిండియా.. ఇప్పుడు వన్డేల్లోనూ టాప్‌ ప్లేస్‌కు చేరింది. దాంతో అన్ని ఫార్మట్లలోనూ టాప్ చేరిన దేశంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది టీమిండియా. శుక్రవారం నాడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టిక టాప్‌కు చేరింది టీమిండియా. వన్డేడ్లో ఇప్పటి వరకు పాకిస్తాన్ జట్టు నెంబర్‌ వన్‌గా ఉండగా.. ఆ దేశాన్ని వెనక్కి నెట్టి టాప్.. నెంబర్ వన్‌గా నిలిచింది టీమిండియా. ఆసియాకప్ కొట్టడంతో పాటు.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సరీస్‌లో మొదటి మ్యాచ్‌లో గెలిచి టాప్ ప్లేస్‌కు చేరింది టీమ్.

ఇక ప్లేయర్స్ విషయంలో టీమిండియానే టాప్..

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్లేయర్స్ పరంగా చూసుకున్నా టీమిండియానే టాప్‌లో ఉంది. ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాకింగ్స్‌లో భాతర క్రికెట్ జట్టు బౌలర్ మహ్మద్ సిరాజ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. టీ20 బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా రవీంద్ర జడేజా ఉన్నాడు. ఇక టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్‌గా అశ్విన్ ఉండగా.. వన్డే బ్యాటింగ్‌లో సెకండ్ ప్లేస్ శుబ్ మన్ గిల్ ఉన్నారు. మొత్తంగా ఇలా టీమిండియాతో పాటు.. మనదేశ ప్లేయర్స్ కూడా టాప్ ప్లేస్‌లో నిలిచి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.

Also Read:

Chandrababu Arrest: చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోంది.. నారా లోకేష్ సంచలన ఆరోపణలు..

canada issue:కెనడియన్లకు భారతీయ వీసాలు నిలిపివేత…

Advertisment
తాజా కథనాలు