asian games:ఆసియా క్రీడల్లో ఫైనల్స్‌కు దూసుకెళ్ళిన బాక్సింగ్, ఆర్చరీ అథ్లెట్లు ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇప్పటికి 62 పతకాలు సాధించిన ఇండియా అథ్లెట్లు మరి పతకాలు సాధించే అవకాశం ఉంది. మరోవైపు క్రికెట్‌లోనూ పురుషుల టీమ్ సెమీ ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళింది. By Manogna alamuru 03 Oct 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఆసియా క్రీడల్లో మనవాళ్ళు చితక్కొడుతున్నారు. ఒకరిని మించి మరొకరు ప్రదర్శన చేస్తూ పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఈరోజు ఇప్పటికే రెండు పతకాలు రాగా మరిన్ని రావొచ్చని అంచనా. అందులో బంగారు పతకాలను కూడా సాధించే అవకాశం ఉంది. కనోయింగ్ ఈవెంట్లో భారత ద్వయం అర్జున్ సింగ్,సునీల్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు. కనోయింగ్ డబుల్స్ విభాగంలో వీరు కాంస్యాన్ని దక్కించుకున్నారు. ఇక 54 కేజీల బాక్సింగ్ విభాగంలో ప్రీతి కూడా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో భారత పతకాల సంఖ్య 62కు చేరుకుంది. ఇందులో 13 స్వర్ణాలు, 24 సిల్వర్, 25 బ్రాంజ్ ఉన్నాయి. మరోవైపు 75 కేజీల బాక్సింగ్ విభాగంలో లవ్లీనా ఫైనల్ కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఫైనల్లో గెలిస్తే స్వర్ణం లేదా రజతాన్ని లవ్లీనా దక్కించుకుంటుంది. వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నం కూడా ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇక్కడ కూడా బంగారు పతకం దక్కే అవకాశం ఉంది. ఇక బ్యాడ్మింటిన్ డబుల్స్ లో అశ్విని పొన్నప్ప-తనీషా కాస్ట్రో రెండో రౌండ్ లోకి అడుగు పెట్టారు. భారత ఆర్చరీ బృందంలో అభిషేక్ వర్మ, ఓజాస్ ఫైనల్స్ కు చేరుకున్నారు. దీని ఫైనల్స్ అక్టోబర్ 7న జరుగుతుంది. అలాగే ఆసియా క్రీడలు 2023లో భారత్ నేపాల్ మీద గెలిచి సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్ళింది. 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుపొందాలంటే 203 పరుగులుచేయాల్సి ఉండగా నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసింది. ఇక చైనాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు.బాక్సింగ్, హెప్టాథ్లాన్ క్రీడా విభాగాల్లో తెలంగాణ ఆణిముత్యాలు నిఖత్ జరీన్, అగసర నందిని ఈరోజు జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు బిడ్డలు తెలంగాణ రాష్ట్రం గర్వపడే విజయాలు సాధించారని సీఎం కొనియాడారు.రాష్ట్ర క్రీడాకారులు తెలంగాణతో పాటు దేశ ఖ్యాతిని మరో మారు చాటారని సీఎం కొనియాడారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ బిడ్డలు తమ ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధించి తెలంగాణకే కాకుండా దేశానికే వన్నె తేవడం సంతోషంగా వుందని సీఎం అన్నారు.క్రీడాకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఈ ప్రోత్సాహం ఇలాగే కొనసాగుతుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. also read:హైకోర్టు కీలక ఆదేశాలు.. లోకేష్ సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా! #archery #athletes #sports #asian-games #boxing మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి