Cricket:500 వికెట్ల క్లబ్‌లో ఆర్. అశ్విన్

భారత పేస్ బౌలర్ ఆర్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో క్రాలీ వికెట్ తీయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. తక్కువ బాల్స్‌లో 500 వికెట్లు సాధించిన వారిలో అశ్విన్ రెండో వ్యక్తిగా నిలిచాడు.

New Update
Cricket:500 వికెట్ల క్లబ్‌లో ఆర్. అశ్విన్

IND vs ENG Third Test:ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత బౌలర్ ఆర్. అశ్విన్ రికార్డ్ సాధించాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌తో జాక్‌ క్రాలేను అవుట్ చేసిన అశ్విన్ 500 వికెట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ 500 వికెట్లు తీయడం ద్వారా అశ్విన్ రెండు ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. తక్కవు బాల్స్‌ వేసి 500 వికెట్లు తీసిన వారిలో అశ్విన్ రెండవ వ్యక్తిగా నలిచాడు. అలాగే అతి తక్కువ మ్యాచ్‌లలో 500 వికెట్లు తీసిన బౌలర్లలో కూడా అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. తక్కువ బాల్స్‌ రికార్డ్‌లో మెక్ గ్రాత్ మొదటి స్థానంలో ఉండగా...తక్కువ మ్యాచ్‌ల రికార్డ్‌లో ముత్తయ్య మురళీ ధరన్ నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్నాడు. అశ్విన్ తరువాత స్థానంలో ఇండియన్ స్పిన్ మాంత్రికుడు అనిల్ కుంబ్లే ఉన్నాడు. అనిల్ కుంబ్లే 105 మ్యాచ్‌లలో 500 వికెట్లు తీసుకున్నాడు. అయితే అతని మొత్తం టెస్ట్ వికెట్ల సంఖ్య 619.

Also Read:Nellore:నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం

మూడో టెస్ట్‌లో 89 పరుగులకు మొదటి వికెట్..

మూడో టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 89 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో రజత్‌ పాటిదార్‌కు క్యాచ్‌ ఇచ్చి జాక్‌ క్రాలే (15) ఔటయ్యాడు. బెన్‌ డకెట్‌కు (68) జతగా ఓలీ పోప్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. అంతకు ముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ 445 పరుగుల వద్ద ముగిసింది. రెండో సెషన్‌లో టీమిండియా చివరి 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. భారత జట్టు తరఫున ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 131 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా కూడా 112 పరుగులు చేశాడు. మ్యాచ్ రెండో రోజు, యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురైల్ కూడా చిన్నదైనా చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అరంగేట్రం మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులు, ధ్రువ్ జురెల్ 46 పరుగులు చేశారు. రవిచంద్రన్ అశ్విన్ 37 పరుగులు, బుమ్రా 26 పరుగులు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు