Jobs : ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అర్హులైతే వెంటనే అప్లై చేఏయండి!

ఇండియన్‌ బ్యాంకులో భారీగా ఉద్యోగాలను భర్తి చేసేందుకు అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 12 నుంచే ప్రారంభం అయ్యింది. దరఖాస్తులు స్వీకరించేందుకు ఏప్రిల్‌ 1 వరకు అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.

New Update
Govt Jobs : నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Bank Jobs : ప్రస్తుతం చాలా మంది యువత బ్యాంకులో ఉద్యోగం చేయాలని కలలు కంటున్నారు. ఎన్నో కోచింగ్ లు తీసుకుని బ్యాంకు నోటిఫికేషన్‌ కోసం వెయిట్‌ చేసేవారికి ఓ గుడ్‌ న్యూస్‌... ఇండియన్‌ బ్యాంకు(Indian Bank) లో భారీగా ఉద్యోగాలను భర్తి చేసేందుకు అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 12 నుంచే ప్రారంభం అయ్యింది.

దరఖాస్తులు స్వీకరించేందుకు ఏప్రిల్‌ 1 వరకు అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్‌ వెబ్‌సైట్‌ www.indianbank.in ని చూసి దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మొత్తంగా 146 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఇంటర్వ్యూ(Interview) ద్వారా ఈ పోస్టులను అధికారులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ అభ్యర్థులు రూ. 175 లు చెల్లిస్తే చాలు. మిగిలిన వారికి రూ. 1000 ఫీజు ఉంటుంది. ముందు బ్యాంకు అధికారిక వెబ్‌ సైట్‌ www.indianbank.in ను ఓపెన్ చేసి కెరీర్‌ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.

స్పెషలిస్ట్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ – 2024(Specialist Officers Recruitment - 2024) పై క్లిక్‌ చేస్తే కొత్త పేజీ వస్తుంది. ఆ తరువాత ఒకదాని తరువాత ఒకటి ఫీల్ చేసుకుంటు వెళ్లాలి. ఉద్యోగానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్ లోనే ఫీజు కూడా కట్టేయాలి.

Also Read : యాదాద్రి ఆలయ ఇన్‌ ఛార్జ్‌ ఈవో పై బదిలీ వేటు!

Advertisment
తాజా కథనాలు