indian army : లెఫ్టినెంట్ కల్నల్ కరణ్‌బీర్ కథ విషాందంతం.. 8 ఏళ్లు కోమాలోనే ఉండి

భారత ఆర్మీ ఆఫీసర్ కరణ్‌బీర్ సింగ్ మరణించారు. 2015లో జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో గాయపడిన ఆయన 8 ఏళ్లుగా కోమాలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం ఆయన మరణ వార్త దేశ ప్రజలను కదిలించింది.

New Update
indian army : లెఫ్టినెంట్ కల్నల్ కరణ్‌బీర్ కథ విషాందంతం.. 8 ఏళ్లు కోమాలోనే ఉండి

Army Officer: భారత ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ కరణ్‌బీర్ సింగ్ కథ విషాదాంతమైంది. 2015లో జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో గాయపడిన ఆయన 8 ఏళ్లుగా కోమాలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం కరణ్‌బీర్ కన్నుమూశారు. కుప్వారాలోని హాజి న‌కా గ్రామంలో న‌వంబ‌ర్ 22 జరిగిన ఆపరేషన్ లో ముగ్గురు సైనికుల్ని కాపాడిన ఆయన ముఖానికి బుల్లెట్ తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఏనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాడిన ఆయన మరణం దేశ ప్రజలను కదిలించింది.

ఇది కూడా చదవండి : Central Bank of India : సెంట్రల్ బ్యాంకులో 484 ఉద్యోగాలు..10వ తరగతి ఉంటే చాలు

ఈ మేరకు 1997లో అత‌ను ఆర్మీలో జాయిన్ అయిన లెఫ్టినెంట్ కల్నల్ నాట్ దాదాపు 20 సంవత్సరాలు సైన్యంలో పనిచేసిన అనుభవజ్ఞుడైన అధికారి. టెరిటోరియల్ ఆర్మీలో చేరడానికి ముందు లెఫ్టినెంట్ కల్నల్ నాట్ 1998లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించి సాధారణ సైన్యంలో చేరారు. షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ అయిన బ్రిగేడ్ ఆఫ్ గార్డ్స్‌లోని 19వ బెటాలియన్‌లో నియమించబడ్డారు. ఈ క్రమంలో టెరిటోరియ‌ల్ ఆర్మీలో యాక్టివ్ ప‌నిచేసి సెనా మెడ‌ల్ గెలుచుకున్నాడు. 160 ఇన్‌ఫాంట్రీ బెటాలియ‌న్ లో సెకండ్ ఇన్ క‌మాండర్ గానూ పని చేశారు. ఇక ఆ ఆపరేషన్ లో కరణ్‌బీర్ సింగ్ గాయపడిన వెంటనే శ్రీనగర్‌కు విమానంలో తరలించి ప్రధమ చికిత్స అందించిన అనంతరం అక్కడినుంచి ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వరకూ మేల్కొని ఉన్న కరణ్‌ బీర్ సింగ్ లో ఆ మరుసటి రోజునుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు