Asian Para Games: ఆసియా పారా గేమ్స్ లో ఆర్చర్ శీతల్ అద్భుత ప్రదర్శన.. గోల్డ్ మెడల్ కైవసం

ఆసియా పారా గేమ్స్ లో ఆర్చర్ శీతల్ దేవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. మహిళల ఆర్చరీలో శీతల్ బంగారు పతకాన్ని సాధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్మ్ లెస్ ఫిమేల్ ఆర్చర్ గా నిలిచి.. ప్యూర్ గోల్డ్ అనిపించుకుంటోంది.

New Update
Asian Para Games: ఆసియా పారా గేమ్స్ లో ఆర్చర్ శీతల్ అద్భుత ప్రదర్శన.. గోల్డ్ మెడల్ కైవసం

Sheetal Devi won Gold Medal in Asian Para Games: చైనాలో హాంగ్జౌ లో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ లో భారత్ క్రీడాకారిణి శీతల్ దేవి (Sheetal Devi) మహిళల ఆర్చరీ విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల సింగల్ ఆర్చరీ (Archery) విభాగంలో శీతల్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్స్ లో సింగపూర్ కు చెందిన అలీమ్ నూర్ సయాహిదాను (Alim Nur Syahidah) ఓడించింది. రెండు షాట్ లలో అలీమ్ నూర్ మార్క్ మిస్ చేయడంతో శీతల్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 144-142 స్కోరుతో విజేతగా నిలిచింది శీతల్.

Also Read: ఫోన్‌ ఆర్డర్‌ పెడితే.. పార్సిల్‌ లో ఇంటికి ఏం వచ్చిందో తెలుసా?

ఆర్చరీ బంగారం శీతల్ దేవికి ఆసియా పారా గేమ్స్ లో ఇది మూడవ పతకం. అంతకు ముందు మహిళల డబుల్స్ కాంపౌండ్ టీమ్ ఆర్చరీ విభాగంలో మరో ఆర్చర్ సరితా అధానాతో కలిసి రజత పతకాన్ని అందుకుంది. 150-152 పాయింట్ల తేడాతో ఈ జంట స్వర్ణాన్ని కోల్పోయారు. దీని తరువాత ఓపెన్ మిక్స్డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్ లో భారత అథ్లెట్ రాకేష్ కుమార్ తో కలసి శీతల్ దేవి స్వర్ణాన్ని సాధించారు. 151-149 తో చైనాకు చెందిన యుషాన్ లిన్, జిన్లింగ్ ఐల మీద విజయం సాధించారు.

జమ్మూ కాశ్మీర్ కు చెందిన శీతల్ దేవి వయసు 16 ఏళ్లు. వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో (World Archery Championships)పతకం సాధించిన మొదటి చేతులు లేని మహిళగా గుర్తింపు పొందింది. ఫోకోమెలియా అనే వ్యాధి కారణంగా చేతులు లేకుండా పుట్టింది శీతల్. ఈ వ్యాధి ఉన్నవారి అవయవాలు అభివృద్ధి చెందవు. కానీ దాన్ని మర్చిపోయేలా ఏదైనా సాధించాలనుకుంది శీతల్. మొదట ప్రోస్థెటిక్ చేతులను అమర్చుకుంది. దాని తర్వాత ఆర్చరీ వైపు దృష్టి సారించింది. శీతల్ పాదాలు, కాళ్ల సహాయంతో బాణాలను సంధిస్తుంది. శీతల్ తన పాదంతో విల్లును పట్టుకునే శైలి ప్రఖ్యాత ఆర్మ్‌లెస్ ఆర్చర్ మాట్ స్టట్జ్‌మాన్‌ను పోలి ఉంటుందని చెబుతున్నారు. చేతులు లేకపోయినా ఆమె సాధిస్తున్న విజయాలు ప్రపంచానికి, క్రీడాకారులకు ఆదర్శమని అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు