Ind Vs Eng: చివరి టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు.. బెంబేలెత్తించిన స్పిన్నర్లు!

ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను భారత్ 4-1 కైవసం చేసుకుంది. ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ను కుల్‌దీప్‌ సొంతంచేసుకోగా ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును యశస్వి జైస్వాల్ దక్కించుకున్నాడు.

Ind Vs Eng: చివరి టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు.. బెంబేలెత్తించిన స్పిన్నర్లు!
New Update

Ind Vs Eng : ఇంగ్లాండ్(England) తో జరిగిన చివరి టెస్టులో భారత్(India) ఘన విజయం సాధించింది. ఐదు టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఇండియా విజయకేతనం ఎగరవేసింది. దీంతో ఈ సీరీస్ ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. ఇక మొదటినుంచి ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో మొదట భారత బ్యాటర్లు సెంచరీలతో భారీ స్కోర్ సాధించగా భారత బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. మొదటి ఇన్నింగ్స్ లో పై చేయి సాధించిన భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లాండును చిత్తుగా ఓడించింది.

ఇది కూడా చదవండి: TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

రెండు అవార్డులు మనకే..

ఈ మేరకు ఇంగ్లాండ్‌ మొదటి ఇన్నింగ్స్ లో 218 పరుగులకే ఆలౌట్ అవగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులకు అలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కుప్పకూలగా భారత్ ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ (84) రాణించగా.. జానీ బెయిర్‌స్టో (39) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు, కుల్‌దీప్‌ 2, బూమ్రా 2, జడేజా 1 వికెట్ తీశారు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోర్ సాధించగా.. రోహిత్ శర్మ (103), శుభ్‌మన్‌ గిల్ (110) శతకాలు బాదారు. యువ బ్యాట్స్ మెన్ పడిక్కల్ (65), యశస్వి జైస్వాల్ (57), సర్ఫరాజ్‌ ఖాన్ (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో కుల్‌దీప్‌ (30), బుమ్రా (20) విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’(Player Of The Match) ను కుల్‌దీప్‌ సొంతంచేసుకోగా.. ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’(Player Of The Series) అవార్డును యశస్వి జైస్వాల్ దక్కించుకున్నాడు.

స్కోరు వివరాలు:

భారత్: తొలి ఇన్నింగ్స్‌ 477/10

ఇంగ్లాండ్‌: తొలి ఇన్నింగ్స్‌ 218/10

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ 195/10

#last-test #india-won #england
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe