India vs Ireland 1st T20: ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 0-1తో ముందంజలో ఉంది. డబ్లిన్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచులో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం యంగ్ ఇండియా సత్తా చాటింది. మొదట బౌలింగ్‌కు వచ్చిన భారత జట్టుకు తొలి ఓవర్‌లోనే కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. దాదాపు సంవత్సరం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లతో సత్తా చాటాడు. 31/5 స్కోరుతో కష్టాల్లో పడిన ఆ జట్టును కాంఫర్, మెక్‌కార్తి భాగస్వామ్యం ఆదుకుంది. బిష్ణోయ్, ప్రసిద్ధ్‌లకు రెండేసి వికెట్లతో రాణించడంతో ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది. చివర్లో బ్యారీ మెక్‌కార్తి(51), క్యాంపర్(39) ధాటిగా ఆడటంతో ఐరీష్ జట్టు గౌరవప్రదం స్కోర్ చేయగలిగింది. చివరి ఓవర్‌లో మెక్‌కార్తి 22 పరుగులతో రాణించి అభిమానుల్లో జోష్ పెంచాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(24), రుతురాజ్ గైక్వాడ్(19) వేగంగా ఆడటంతో 6.5 ఓవర్లలో 2 వికెట్లకు 47 రన్స్ చేసింది. అయితే ఆ సమయంలో భారీ వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. దీంతో DLS పద్దతిన 45 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత్ 47తో ఉండడంతో విజయం దక్కింది. రెండు వికెట్లతో సత్తా చాటిన బుమ్రా కమ్ బ్యాక్ మ్యాచులోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం విశేషం. ఇక ఈ మ్యాచులో ఐపీఎల్ ప్లేయర్స్ రింకూ సింగ్, శివందూబే అరంగేంట్రం చేశారు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము గెలిచినా కొన్ని అంశాల్లో మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. అయితే జట్టులో ప్రతిఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఐపీఎల్ ఆడిన అనుభవం వారికి కలిసొచ్చింది. ప్రత్యర్థి జట్టు ఐర్లాండ్ కూడా బాగా ఆడింది. మిగిలిన మ్యాచులలోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసి విజయం సాధిస్తామని బుమ్రా వెల్లడించారు.
ఇక ఈ మ్యాచుతో భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ చేయని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు బుమ్రా. కెప్టెన్సీ వహించిన తొలి టీ20 మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న తొలి ఇండియా క్రికెటర్‌గా నిలిచాడు. సెప్టెంబర్ 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయం కారణంగా గత 11 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. 2022 T20 ప్రపంచ కప్, IPL, WTC ఫైనల్‌లో కూడా ఆడలేదు. ఇప్పుడు తిరిగి రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా నాలుగు ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
India vs Ireland 1st T20 Highlights:
Also Read: పరిగెత్తలేక అవుటైన 140కేజీల వీరుడు.. నవ్వుల పువ్వులు!