Viral Video: పరిగెత్తలేక అవుటైన 140కేజీల వీరుడు.. నవ్వుల పువ్వులు!

విండీస్‌ భారీకాయుడు రఖీమ్‌ కార్న్‌వాల్‌కి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. లూసియా కింగ్స్‌, బార్బడోస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కార్న్‌వాల్‌ అవుటైన తీరు చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. బార్బడోస్‌ తరుఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన కార్న్‌వాల్‌ మొదటి బంతికి పరిగెత్తలేక రన్‌ అవుట్ అయ్యాడు.

New Update
Viral Video: పరిగెత్తలేక అవుటైన 140కేజీల వీరుడు.. నవ్వుల పువ్వులు!

Rahkeem Cornwall Run Out Video: క్రికెట్‌ ఆడేందుకు ఫిట్‌నెస్‌ ముఖ్యం. ఫిట్‌గా ఉండి, వికెట్ల మధ్య రన్నింగ్‌ బాగా చేస్తే ఒక్క పరుగు చేయాల్సిన చోట రెండు పరుగులు తీయవచ్చు. రెండు పరుగులు తీయాల్సిన చోట మూడు పరుగులు చేయవచ్చు. ధోనీ, కోహ్లీ, సచిన్‌ రన్నింగ్‌ బిట్‌విన్‌ ది వికెట్స్‌ చూస్తే ఈ విషయం క్లియర్‌ కట్‌గా అర్థమవుతుంది. అయితే ఫిట్‌నెస్‌ లేకున్నా.. వేగంగా పరుగులు చేయలేకున్నా టాలెంట్‌లో ఎవరికి తీసిపోకుండా.. పరుగులు వరద పారించిన బ్యాటర్లు ఉన్నారు. టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌(Sehwag), పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌(Inzamam) ఈ లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటారు. క్రికెట్‌పై చెరిగిపోని ముద్ర వేసిన ఈ ఆటగాళ్లు పరిగెత్తడం కంటే బౌండరీల బాదడంపైనే దృష్టి పెడతారు. ప్రస్తుత క్రికెట్‌లో విండీస్‌ వీరుడు రఖీమ్‌ కార్న్‌వాల్‌(Rahkeem Cornwall) కూడా అంతే. టీ20ల్లో రెచ్చిపోయి ఫోర్లు, సిక్సులు కొట్టడం కార్న్‌వాల్‌ స్పెషాలిటీ. ఇక కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో ఓ విచిత్ర ఘటన జరిగింది.


పాపం.. తొలి బంతికే:
క్రికెట్ ఆజానుబాహుడు రఖీమ్‌ కార్న్‌వాల్‌ హైట్ 6 అడుగుల 6 అంగుళాలు. బరువు 140 కేజీలు. ఇంత భారీకాయుడికి పరిగెత్తడం కష్టం. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌(Caribbean Premier League)లో బార్బడోస్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఇన్నింగ్స్‌లోని మొదటి బంతికే రనౌట్‌(Run out) అయ్యాడు. 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కార్న్‌వాల్ ఫస్ట్ బాల్‌కే అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం కార్న్‌వాల్‌ రన్‌ అవుట్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. లూసియా కింగ్స్, బార్బడోస్ రాయల్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కార్న్‌వాల్ జట్టు 147 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఎలా అవుట్‌ అయ్యాడు?
202 పరుగుల టార్గెట్‌ ఛేజ్‌ చేసేందుకు బార్బడోస్‌ తరఫున ఓపెనర్‌గా వచ్చాడు కార్న్‌వాల్‌. వచ్చి రావడంతోనే భారీ షాట్‌కి ట్రై చేశాడు. అయితే బ్యాట్‌కి బాల్‌ సరిగ్గా కనెక్ట్ కాలేదు. అది కాస్త ఫైన్‌ లెగ్‌ వద్దకు వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న క్రిస్ సోలే బంతిని ఆపలేకపోయాడు. మిస్‌ ఫీల్డ్ చేశాడు. ఇది గమనించిన నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న ప్లేయర్‌ పరుగు తీశాడు.. కార్న్‌వాల్‌ మాత్రం స్లోగా పరిగెత్తలేక.. ఆయాసపడుతూ పరుగు పూర్తి చేసేందుకు ట్రై చేశాడు.. ఇంతలోనే సోలే బాల్‌ని థ్రో చేశాడు. అది కాస్త నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో వికెట్లను తాకింది..కార్న్‌వాల్‌ అవుట్‌ అయ్యాడు ఇంకేముంది లూసియా కింగ్స్‌ జట్టు ఆనందానికి హద్దే లేకుండా పోయింది.. ఇలాంటి విచిత్ర పరిస్థితిలో కార్న్‌వాల్‌ అవుట్ అవుతాడని బార్బడోస్‌ ఊహించలేదు. కార్న్‌వాల్‌ త్వరగా అవుట్ అవ్వడం బార్బడోస్‌ టీమ్‌పై ఎఫెక్ట్ పడింది. ఉన్నంత సేపు బంతిని బాది పడేసే కార్న్‌వాల్‌ మొదటి బంతికే అవుట్ అవ్వడంతో లూసియా కింగ్స్‌ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: ఇందుకే కద భయ్యా కోహ్లీని కింగ్‌ అనేది.. ఈ వీడియో తప్పక చూడాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు