BREAKING: సౌత్ ఆఫ్రికాపై భారత్ గెలుపు

టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని కలలుగన్న దక్షిణాఫ్రికాకు టీమ్ ఇండియా షాక్ ఇచ్చింది. రెండో టెస్టులో భారీ విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

BREAKING: సౌత్ ఆఫ్రికాపై భారత్ గెలుపు
New Update

IND VS SA: కేప్‌టౌన్‌ టెస్టులో అపూర్వ విజయంతో సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ సమఉజ్జీగా నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేయడంతో ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను డ్రా చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, నండ్రీ బర్గర్, మార్కో జాన్సన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ALSO READ: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

భారత బౌలర్లు రెచ్చిపోయి సఫారీలను ఆటాడుకోవడంతో కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు భారత వశమైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత బౌలర్లు ప్రొటిస్‌ బ్యాట్స్‌మెన్‌పై తిరుగులేని ఆధిపత్యం చెలాయించి ఈ విజయంలో కీలకమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 55 పరుగులకే కుప్పకూలగా, భారత జట్టు 153 పరుగులు చేయగలిగింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ సౌతాఫ్రికాను టీమ్‌ఇండియా 176 పరుగులకే పరిమితం చేసింది. దీంతో భారత్‌ ఎదుట 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఉంచింది. జస్‌ప్రీత్ బుమ్రా (6/61) విజృంభించడంతో ప్రొటిస్‌ జట్టు తొలి 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ముకేశ్ కుమార్ 2, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు.



రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ ఛేదించింది. జైస్వాల్ (28; 23 బంతుల్లో 6 ఫోర్లు), రోహిత్ శర్మ (17నాటౌట్‌; 22 బంతుల్లో 2 ఫోర్లు), విరాట్ కోహ్లీ (12), శుభ్‌మన్‌ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (4నాటౌట్‌) పరుగులు చేశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 62/3తో ఇన్నింగ్స్‌ రెండో రోజు ప్రారంభించిన దక్షిణాఫ్రికా 176 వద్ద ఆలౌటైంది. మార్‌క్రమ్ (106; 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా సెంచరీ పూర్తి చేశాడు.

#india-won #ind-vs-sa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe