Miss World: భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు.. ఎప్పటి నుంచంటే..

ప్రపంచ సుందరి ( మిస్‌ వరల్డ్‌ ) పోటీలు ఈసారి భారత్‌లో జరగనున్నాయి. ఈనెల మార్చి 18 న్యూఢిల్లీలో ప్రారంభమై.. మార్చి 9న ముంబైలో ముగియనున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన మొత్తం 120 మంది అందెగత్తెలు వివిధ పోటీల్లో, దాతృత్వ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

New Update
Miss World: భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు.. ఎప్పటి నుంచంటే..

ప్రపంచ సుందరి ( మిస్‌ వరల్డ్‌ ) పోటీలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఎవరు మిస్‌ వరల్డ్‌గా నిలిచిన వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. అయితే ఈసారి ఈ అందాల పోటీలో మన భారత్‌లోనే జరగనున్నారు. ఇప్పటికే 70 పోటీలు పూర్తి చేసుకోగా.. 71వ ఎడిషన్‌ పోటీలు న్యూఢిల్లీలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 నుంచి మార్చి 9 వరకు జరుగుతాయి. 28 ఏళ్ల తర్వాత ఇండియాలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారని శుక్రవారం నిర్వాహకులు తెలిపారు.

Also Read: నేడు అసెంబ్లీకి రానున్న కేసీఆర్‌.. తొలి ప్రసంగంపై ఉత్కంఠ

ఫిబ్రవరి 18న న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ వేడుకలు.. మార్చి 9న ముంబైలో ముగుస్తాయి. న్యూఢిల్లిలో భారత్‌ మండపంతో పాటు మరికొన్ని వేదికల్లో ఈ పోటీలు జరుగుతాయి. ప్రపంచ దేశాలకు చెందిన మొత్తం 120 మంది అందెగత్తెలు వివిధ పోటీల్లో, దాతృత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మిస్‌ వరల్డ్‌ సంస్థ సీఈఓ, అధ్యక్షురాలు జులియా మోర్లే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పట్ల నాకున్న ప్రేమ దాచలేనిదని.. ఈ దేశంలో మిస్ వరల్డ్‌ పోటీలు జరగటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.

Also Read: కొత్త భారతదేశాన్ని సృష్టించేందుకు ఇది సరైన సమయం: మోడీ

Advertisment
తాజా కథనాలు