India vs South Africa: సౌతాఫ్రికాలో టీమిండియా తీరిది.. ఈసారైనా ఆ ఘనత సాధిస్తారా? టీమిండియా సౌతాఫ్రికా చేరుకుంది. ఈనెల 10 నుంచి 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇప్పటివరకూ సౌతాఫ్రికాలో భారత్ ప్రదర్శన టీ20 లలో తప్ప మిగిలిన ఫార్మేట్లలో పేలవంగా ఉంది. ఈసారి టెస్ట్, వన్డే సిరీస్ లలో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. By KVD Varma 07 Dec 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి India vs South Africa: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా బయలుదేరి వెళ్ళింది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు టీ20 రికార్డు అద్భుతంగా ఉంది. అక్కడ జరిగిన మ్యాచ్ ల్లో మన జట్టు 62 శాతం గెలిచింది. అంటే ఆఫ్రికా పిచ్ లపై ప్రతి రెండో మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధిస్తోంది. అంతే కాదు దక్షిణాఫ్రికాలో జరిగిన ఏకైక టీ20 ప్రపంచకప్ ను (T20 World Cup) కూడా భారత జట్టు గెలుచుకుంది. ఈసారి డిసెంబర్ 10, 12, 14 తేదీల్లో టీ20 సిరీస్ జరగనుంది . ఆ తర్వాత డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో వన్డేలు జరుగుతాయి. ఆ తర్వాత డిసెంబర్ 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు-వన్డేల్లో పేలవ ప్రదర్శన, కానీ టీ20 టాప్.. ఎందుకలా? ఆఫ్రికా గడ్డపై భారత్ టెస్టు, వన్డే రికార్డు పేలవంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు అక్కడ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు, వన్డేల్లో 8 సిరీస్ లలో కేవలం ఒక్క సిరీస్ మాత్రమే గెలిచింది. అదే సమయంలో ఆ జట్టు అక్కడ 4 టీ20 సిరీస్లలో 3 గెలిచింది. దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి, చివరి టీ20 ప్రపంచకప్ను కూడా భారత జట్టు గెలుచుకుంది. 2007లో జొహన్నెస్ బర్గ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు పాకిస్థాన్ పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. Also Read: టీమిండియాకు మరో 3D బౌలర్? ఆల్‌రౌండర్ కొరత తీరనుందా? దీనికి కారణం సౌతాఫ్రికాలో టెస్ట్, వన్డే సిరీస్ ల తరువాత ఇప్పటివరకూ టీ20 సిరీస్ జరిగుతూ వచ్చింది. దీంతో టెస్ట్, వన్డేల్లో ఆడిన సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి యువతకు అవకాశం ఇచ్చేది సౌతాఫ్రికా మేనేజ్మెంట్. దీంతో భారత్ కు గెలుపు ఈజీ అయిపోయేది. ఇక ఐపీఎల్ అనుభవం భారత్ కు బాగా కలిసి వస్తోంది. ఐపీఎల్ లో వివిధ దేశాల ఆటగాళ్లతో కలిసి మ్యాచ్ లు ఆడుతుంటే, మన క్రికెటర్లు టీ20 ఫార్మేట్ లో బాగా ప్రతిభ సాధిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో టీమిండియా ఇలా.. సౌతాఫ్రికా గడ్డపై భారత్ ఆడిన 23 టెస్టుల్లో 4, 56 వన్డేల్లో 22, 13 టీ20ల్లో 8 గెలిచింది. అంటే భారత జట్టు టెస్టు-వన్డేల కంటే ఎక్కువ టీ20లను గెలుస్తోంది. అక్కడ 61.53 శాతం మ్యాచ్ ల్లో జట్టు విజయం సాధించగా, వన్డేల్లో 39.28 శాతం, టెస్టుల్లో 17.39 శాతం మ్యాచ్ లు గెలిచింది. స్వదేశంలో 71 శాతం టీ20ల్లో భారత్ విజయం: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20ల్లోనూ భారత్ ప్రదర్శన అద్భుతం. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఆడిన 23 టెస్టుల్లో 4, 37 వన్డేల్లో 10, 7 టీ20ల్లో 5 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై టెస్టుల్లో 17.39 శాతం, వన్డేల్లో 27.02 శాతం, టీ20ల్లో 71.42 శాతం గెలిచింది. సౌతాఫ్రికా మైదానంలో 9 మంది ఆటగాళ్లు భారత జట్టుకు నాయకత్వం వహించారు, వీరిలో సౌరవ్ గంగూలీ - విరాట్ కోహ్లీ (Virat Kohli) అత్యంత విజయవంతమైన కెప్టెన్లుగా చెప్పవచ్చు. Watch this interesting Video: #team-india #south-africa #india-vs-south-africa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి