INDIA vs South Africa : రవితేజ (Ravi Teja) నటించిన విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం ఒక డైలాగ్ అంటాడు.. 'దొంగ దొంగ అని నన్ను ఒకడినే అంటావ్ ఏంటి.. వెనకాల ఉన్నవాడు...' అని ఉంటుందీ ఆ డైలాగ్. ఈ డైలాగ్ చాలా ఫేమస్. బ్రహ్మానందం (Brahmanandam) మాటలను చాలా సందర్భాల్లో నిజజీవితంలో ఉపయోగించుకుంటారు చాలామంది. ఇది సౌతాఫ్రికా, ఇండియా క్రికెట్ జట్లకు కూడా సరిపోతుంది. సౌతాఫ్రికాకు ఇప్పటివరకు ఒక్క ప్రపంచకప్ కూడా లేదు. ప్రతీసారి చోక్ అవ్వడం వారి నైజం. ఇది మొదటి నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు. అలా దక్షిణాఫ్రికాకు 'చోక్' ట్యాగ్ ఇచ్చారు క్రికెట్ ఫ్యాన్స్.. అయితే అసలు చోకర్స్ దక్షిణాఫ్రికా మాత్రమే కాదంటున్నారు పలువురు క్రికెట్ లవర్స్. చోకింగ్‌లో టీమిండియా సౌతాఫ్రికాకు ఏం తక్కువ అని ప్రశ్నిస్తున్నారు.
2023 వన్డే ప్రపంచకప్‌లో సమయంలో ఓ ఇండియన్ రిపోర్టర్ నాటి దక్షిణాప్రికా కెప్టెన్ బావుమాను చోకింగ్‌పై ఓ క్వశ్చన్ అడిగాడు. దీంతో కెప్టెన్‌గారికి ఒళ్లు మండింది. మేం చోకర్స్ అయితే టీమిండియా ఏంటని రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో దెబ్బకు రిపోర్టర్ మూతి మూతపడింది. ఇవాళ(జూన్ 29) టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 ఫైనల్ పోరు ఉండడంతో చాలా మంది ఈ రెండు జట్ల చోకింగ్ గురించి చర్చించుకుంటున్నారు.
రోహిత్ ఆ ట్యాగ్‌ను వదిస్తాడా?
టీమిండియా (Team India) చివరిసారి 2013లో ఐసీసీ మెగా ఈవెంట్‌లో కప్ సాధించింది. ధోనీ కెప్టెన్సీలో నాడు ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా కప్ గెలవలేదు. అయితే ఫైనల్‌లో లేదా సెమీస్‌లో ఓడిపోవడం టీమిండియాకు అలవాటుగా మారింది. 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఓటమి నుంచి 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ వరకు టీమిండియా చోక్ చేస్తూనే ఉంది. అంటే ఈ దశాబ్దాపు చోకర్‌గా టీమిండియాకు ట్యాగ్ ఇవొచ్చు. సౌతాఫ్రికా సంప్రదాయ చోకింగ్‌కు పెట్టింది పేరైతే.. భారత్ జట్టు ఈ పదేళ్లలో సౌతాఫ్రికాకు మేం ఏం తక్కువ కాదు అనే రీతిలో సెమీస్, ఫైనల్స్‌లో ఓటములు మూటగట్టుకుంది. మరీ చూడాలి ఈ ఫైనల్ ద్వారా చోకింగ్ ముద్రను ఎవరు వదిలించుకుంటారో..!
Also Read: ఫైనల్‌లో కోహ్లీని పక్కన పెట్టడం ఖాయమేనా? రోహిత్ మదిలో ఏముంది?