India vs Pakistan Asia Cup 2023 Live Score🔴: పాక్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ!

ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. నిర్ణిత ఓవర్లలో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

India vs Pakistan Asia Cup 2023 Live Score🔴: పాక్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ!
New Update

ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. పాకిస్థాన్‌పై గ్రాండ్‌ విక్టరీ సాధించింది. భారత్‌ బౌలర్ల దాటికి పాక్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అసలు బ్యాటింగ్‌ చేయడమే మరిచిపోయినట్టు ఆడారు. ఆడుతున్నది వన్డేనా, టెస్టా అన్న రీతిలో సాగిందీ పాక్‌ బ్యాటింగ్‌. ఏకంగా 228 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

  • Sep 11, 2023 23:11 IST
    228 పరుగుల తేడాతో టీమిండియా విజయం..
  • Sep 11, 2023 22:02 IST
    పాక్‌ నాలుగో వికెట్‌ డౌన్‌

    పాకిస్థాన్‌ మరో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 20 ఓవర్‌లో ఫఖర్ జమాన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం 19.2 ఓవర్లకు పాక్‌ స్కోర్‌ 77-4గా ఉంది.

  • Sep 11, 2023 21:57 IST
    క్యాచ్‌ మిస్‌

    జమాన్‌ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ మిస్ చేశాడు. 18వ ఓవర్‌ వేసిన కుల్దీప్‌ యాదవ్‌ను జమాన్‌ ఎదుర్కొన్నాడు. ఈ ఓవర్‌లోని మూడో బంతిని జమాన్‌ స్లిప్‌ క్యాచ్‌ ఇచ్చాడు. కానీ స్లిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మ్ చేతిలోకి వచ్చిన బాల్‌ను వదిలేశాడు. ప్రస్తుతం పాక్ 18 ఓవర్లు పైర్తయ్యే లోపు 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.

  • Sep 11, 2023 21:46 IST
    భారత బౌలింగ్‌ దళానికి తట్టుకోలేకపోతున్న పాక్‌ బౌలర్లు

    భారత బౌలర్ల దాటికి పాక్‌ బ్యాటర్లు తట్టుకోలేకపోతున్నారు. భారత బౌలింగ్‌ దళం బుమ్రా, శార్దూల్‌ ఠాగూర్, హార్డిక్ పాండ్యా పాక్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. కాగా ప్రస్తుతం పాక్‌ 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. పాక్‌కు అవసరమైన రిక్వైర్డ్‌ రన్‌రేట్‌ పెరుగుతూ పోతోంది

  • Sep 11, 2023 21:37 IST
    ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న పాక్ బ్యాటర్లు

    పాకిస్థాన్‌ బ్యార్లు నిదానంగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. రిజ్వాన్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సల్మాన్‌ ధాటిగా ఆడే ప్రతయ్నం చేస్తు్న్నాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసే లోపు పాకిస్థాన్‌ మూడు వికెట్లు కోల్పోయి 56 పరగులు చేసింది. కాగా పాకిస్థాన్‌కు రిక్వైర్ట్‌ రన్‌రేట్‌ 8.3గా ఉంది.

  • Sep 11, 2023 21:25 IST
    మహ్మద్‌ రిజ్వాన్‌ ఔట్‌

    మరోవైపు తన మొదటి ఓవర్‌లోనే శార్దూల్‌ ఠాగూర్‌ కీలక వికేట్‌ను తీసుకున్నాడు. పాక్ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ వికెట్‌ను తీసుకున్నాడు. రిజ్వాన్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనెదిరిగాడు.

  • Sep 11, 2023 21:25 IST
    ఆగిన వర్షం.. మళ్లీ ప్రారంభమైన మ్యాచ్‌

    కొలంబోలో వర్షం తగ్గింది. దీంతో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ తిరిగి ప్రారంమైంది. 12వ ఓవర్ల్ వేసేందుకు శార్దూల్‌ ఠాకూర్‌ సిద్ధమయ్యాడు. ప్రస్తుతం 11.2 ఓవర్లలో పాకిస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 47 పరుగుల చేసింది.

  • Sep 11, 2023 20:58 IST
    మ్యాచ్‌ను ఎన్ని ఓవర్లకు కుదిస్తే.. పాక్‌ ఎన్ని పరుగులు చేయాలి.?

    భారత్‌-పాక్‌ మ్యచ్‌కు వర్షం అడ్డు పడటంతో అంప్లైరు ఓవర్లను కుదించే అవకాశం ఉంది. ఒకవెళ మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదిస్తే పాక్‌ టార్గెట్ 200 పరుగులుగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు 22 ఓవర్లకు మ్యాచ్‌ను కుదిస్తే పాక్‌ లక్ష్యం 216 పరుగులుగా ఉండే ఛాన్స్‌ ఉంది. అదే 26 ఓవర్ల మ్యాచ్‌ అయితే పాకిస్థాన్‌ 244 పరుగులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాక్‌ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం టీమ్‌ ఇండియా రిజ్వాన్‌ వికెట్‌ తీసుకుంటే భారత విజయం ఖయమనే చెప్పాలి.

  • Sep 11, 2023 20:43 IST
    పాక్‌కు గట్టి షాక్‌ ఇచ్చిన భారత బౌలర్లు

    పాక్‌ టీమ్‌కు భారత బౌలర్లు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. మొదట భారత రేసు గుర్రం బుమ్రా ఓపెనర్‌ ఇమామ్‌ను తన యార్కర్లతో బొల్తా కొట్టించగా.. అనంతరం హార్డిక్ పాండ్యా డేంజరస్‌ బ్యాటర్‌ బాబర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశారు. దీంతో పాక్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. రిజ్వాన్‌ వికెట్‌ తీస్తే చాలు భారత విజయం నల్లేరుపై నడకగా మారిపోతుంది.

  • Sep 11, 2023 20:26 IST
    పాక్‌తో మ్యాచ్‌లో విరాట్‌ రికార్డులు

    పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత సీనియర్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీతో చెలరేగగా.. ఇదే మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ సెంచరీ ద్వారా కోహ్లీ వన్డేల్లో 47వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు వన్డేల్లో వేగంగా 13 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న మొదటి బ్యాటర్‌గా రికార్డ్‌ సృష్టించాడు. విరాట్‌ కోహ్లీ కేవలం 267 మ్యాచ్‌ల్లోనే 13 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.

  • Sep 11, 2023 20:11 IST
    మరోసారి వర్షం.. ఆగిన మ్యాచ్‌

    భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు మరోసారి వరుణుడు అడ్డుకున్నాడు. 11 ఓవర్లు పూర్తి అవ్వగానే కొలంబోలో వర్షం ప్రారంభం కావడంతో అంప్లైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం రెండు వికెట్ల కోల్పోయిన పాకిస్థాన్ 44 పరుగులు చేసింది.

  • Sep 11, 2023 20:07 IST
    రెండో వికెట్‌ కోల్పోయిన పాక్‌.. బాబర్‌ ఔట్

    పాక్‌ రెండో వికెట్‌ కోల్సోయింది. ఆల్‌ రౌండర్‌ హార్డిక్ పాండ్యా వేసిన మొదటి ఓవర్లోనే పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ క్లీన్ బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం పాక్‌ 10.4 ఓవర్లో 42-2గా ఉంది.

  • Sep 11, 2023 19:57 IST
    ఖాతా తెరిచిన బాబర్‌

    పాకిస్థాన్‌ బ్యాటర్లు నెమ్మదిగా స్పీడ్‌ పెంచారు. బుమ్రా బౌలింగ్‌లో బౌండరీ ద్వారా  పాక్ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ ఖాతా తెరిచాడు.  మరో ఎండ్‌లో ఉన్న జమాన్‌ 21 బంతుల్లో 14 పరుగులు చేశాడు. 8 ఓవర్లు పూర్తయ్యే లోపు పాక్‌ వికెట్‌ నష్టానికి 38 పరుగులు చేసింది.

  • Sep 11, 2023 19:46 IST
    భారత బౌలర్లను ఎదుర్కోలేకపోతున్న పాక్

    భారత బౌలర్లను ఎదుర్కోవడంలో పాక్‌ బ్యాటర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌లో పాకిస్థాన్‌ బ్యాటర్లు జమాన్‌, బాబర్‌లు పరుగులు రాబట్టేలేకపోతున్నారు. ప్రస్తుతం 7 ఓవర్లలో పాక్‌ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.

  • Sep 11, 2023 19:39 IST
    పాక్‌ మొదటి వికెట్‌ డౌన్

    పాకిస్థాన్ మొదటి వికెట్‌ కోల్పోయింది. బుమ్రా వేసిన 5 ఓవర్‌లో ఇమామ్‌ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో కెప్టెన్‌ బాబర్‌ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 5.2 ఓవర్లకు పాక్‌ వికెట్‌ నష్టానికి 17 పరుగులు చేసింది

  • Sep 11, 2023 19:32 IST
    ఛేజింగ్‌కు దిగిన పాక్‌

    భారత్ విధించిన భారీ టార్గెట్‌ ఛేచించేందుకు పాక్‌ రంగంలోకి దిగింది. పాకిస్థాన్‌ ఓపెనక్లు జమాన్‌, ఇమామ్‌లు ఆచి తూచి ఆడుతున్నారు. బుమ్రా, సిరాజ్‌ బౌలింగ్‌ దళాన్ని ఎదుర్కోవడంలో పాక్‌ ఓపెనర్లు ఇబ్బంది పడుతుననారు. ప్రస్తుతం 3 ఓవర్లలో పాక్‌ 16 పరుగులు చేసింది. పాక్‌ బ్యాటర్లలో ఇమామ్‌ 8 పరుగులు చేయడగా.. జమాన్‌ ఇంకా ఖాతా తెరవలేదు.

  • Sep 11, 2023 18:43 IST
    పాక్‌ టార్గెట్‌@357

    ఆసియాకప్‌లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. కేఎల్‌ రాహుల్‌ 111, విరాట్‌ కోహ్లీ 122 సెంచరీతో చెలరేగడంతో భారత్‌ 356 పరుగులు చేసింది. చివరి బంతుల్లో కింగ్‌ కోహ్లీ ఫోర్‌, సిక్స్‌ బాధాడు. దీంతో టీమిండియా 356 పరుగులకు చేరుకుంది. అంతకు ముందు భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 121 పరుగుల ఓపెనింగ్‌ భాగస్యామ్యంతో భారత్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పాక్‌ గెలుపుకోసం 7.1 నెట్‌ రన్‌రేట్‌తో 50 ఓవర్లలో 357 పరుగులు చేయాలి

  • Sep 11, 2023 18:28 IST
    విరాట్‌ కోహ్లీ సెంచరీ

    విరాట్‌ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. కింగ్‌ మిసన్‌ కేవలం 84 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. దీంతో పాకస్థాన్‌పై విరాట్‌ సెంచరీల సంఖ్య 3కు చేరింది.

  • Sep 11, 2023 18:26 IST
    కేఎల్‌ రాహుల్ సెంచరీ

    పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ సెంచరీతో చెలగాడు. కేవలం 100 బంతుల్లోనే కేఎల్‌ రాహుల్‌ సెంచరీ చేశాడు.

  • Sep 11, 2023 18:18 IST
    భారత్ స్కోర్‌ @300

    భారత్‌ స్కోర్ 300 పరుగులు దాటింది. అఫ్రీదీ వేసిన 46వ ఓవర్లో పరుగుల వేగం తగ్గింది. ప్రస్తుతం భారత్‌ 2 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 97, విరాట్‌ కోహ్లీ 86 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Sep 11, 2023 18:14 IST
    సెంచరీ దిశగా కేఎల్ రాహుల్‌

    కేఎల్ రాహుల్‌ సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఫహీమ్‌ బౌలింగ్‌లో భారీ షాట్ల కొట్టాడు. దీంతో కేఎల్‌ రాహుల్‌ 90 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 45 ఓవర్లో మొత్తం 14 పరుగులు వచ్చాయి

  • Sep 11, 2023 18:10 IST
    44 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 286

    టీమిండియా స్కోర్‌ 300 పరుగులకు చేరువవుతోంది. ప్రస్తుతం 44 ఓవర్లు ముగిసే సరిగా విరాట్‌ కోహ్లీ 83, కేఎల్‌ కాహుల్‌ 84 పరుగులుతో ఉండగా భారత్‌ 2 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.

  • Sep 11, 2023 18:05 IST
    మూడో వికెట్‌ భాగస్వామ్యం@150

    43 ఓవర్‌లో విరాట్‌ కోహ్లీ వరుస బంతుల్లో ఫోర్‌, సిక్స్‌ బాధాడు. ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు రాగా.. భారత్‌ మూడో వికెట్‌ భాగస్వామ్యం 150 పరుగులు దాటింది.

  • Sep 11, 2023 18:01 IST
    తగ్గిన వేగం

    42వ ఓవర్‌లో షాహిన్‌ అఫ్రదీ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. అయితే చివరి బంతికి కేఎల్‌ రాహుల్‌ ఫోర్‌ కొట్టడంతో ఈ ఓవర్లో కేవలం 9 పరుగులు మాత్రమే

  • Sep 11, 2023 17:52 IST
    40 ఓవర్లు భారత్‌ స్కోర్‌@ 250 మార్క్‌

    ఫహీమ్‌ వేసిన 40 ఓవర్‌ను కేఎల్‌ రాహుల్‌ ఫోర్‌తో మొదలు పెట్టాడు. 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత స్కొర్‌ 251 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్ 72 పరగులతో క్రీజులో కొనసాగుతుండగా.. విరాట్‌ కోహ్లీ 55 పరుగులతో ఉన్నాడు.

  • Sep 11, 2023 17:45 IST
    కోహ్లీ @50

    భారత రన్‌ మిషన్‌ విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 55 బంతుల్లో కోహ్లీ 50 పరుగుల మార్కును అందుకున్నాడు. ప్రస్తుతం భారత్‌ 38.4 ఓవర్లలో 2 వికేట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.

  • Sep 11, 2023 17:35 IST
    100 మార్క్‌ను దాటిన భాగస్వామ్యం

    హాఫ్‌ సెంచరీ అనంతరం కేఎల్‌ రాహుల్‌ ధాటిగా ఆడే ప్రయత్నం చూస్తున్నాడు. ప్రతీ బాల్‌ను బైండరీకి తరలించే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు విరాట్‌ సైతం హాఫ్‌ సెంచరీ దిశగా సాగుతున్నడు. మరోవైపు మూడో వికెట్‌ భాగస్వామ్యం 100 పరుగులు దాటింది.

  • Sep 11, 2023 17:27 IST
    35వ ఓవర్లో 14 పరుగులు

    విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ బంతులను పోటీ పాటీగా బౌండరీలకు తరలిస్తున్నారు. దీంతో భారత్ రన్‌ రేట్‌ 6.4కు చేరుకుంది. కేఎల్‌ రాహుల్ 34.1, 34.2 వరుస బంతుల్లో ఫోర్‌, సిక్స్‌ బాధాడు. శాబాద్‌ వేసిన ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి.

  • Sep 11, 2023 17:22 IST
    కేఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీ

    బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు కేవలం 60 బంతుల్లోనే 50 మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా 33.3 ఓవర్లుకు 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది

  • Sep 11, 2023 17:19 IST
    అదరగొడుతున్న బ్యాటర్లు

    భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. విరాట్‌, కేఎల్‌ పోటా పోటీగా బంతులను బౌండరీకి తరలిస్తున్నారు. పాకిస్థాన్‌ బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వడం లేదు. దీంతో పాక్‌ బౌలర్లు వికెట్లు తీసేందుకు శ్రమిస్తున్నారు. మరోవైపు కేఎల్‌ రాహుల్‌ హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.

  • Sep 11, 2023 17:11 IST
    ఆచితూచి ఆడుతున్న భారత్

    వర్షం వల్ల ఆదివారం ఆగిపోయిన మ్యాచ్‌ రిజర్వ్‌ డే రోజు కాస్త ఆలస్యమైనా ప్రారంభంది. క్రీజులో ఉన్న విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ ఆచితూచి ఆడుతున్నారు. 30 ఓవర్లలో భారత్‌ 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ 30 బంతుల్లో 22, కేఎల్‌ రాహుల్ 40 బంతుల్లో 31 పరుగులతో కొనసాగుతున్నారు.

#pakistan #india #asia-cup-2023 #reserve-day #commencement #india-vs-pakistan-live-score-asia-cup #asia-cup-super-4
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe