IND VS ENG: మళ్లీ అదే స్ట్రాటజీ.. యువకులతోనే ఇంగ్లండ్‌పై బరిలోకి.. టెస్టు జట్టు ప్రకటన! ఇంగ్లండ్‌పై స్వదేశంలో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు బీసీసీఐ భారత్ జట్టు ప్రకటించింది. సీనియర్లు రహానే, పుజారా స్థానంలో గిల్, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్‌కు మరో ఛాన్స్ ఇచ్చింది. అటు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. By Trinath 13 Jan 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి దక్షిణాఫ్రికా(South Africa)తో టెస్టు సిరీస్‌ను ఇండియా(India) డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. సఫారీ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌ను ఇండియా 1-1తేడాతో సమం చేసింది. 2010 తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ను చేజార్చుకోని భారత్.. మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. ఈ నెల(జనవరి) 25 నుంచి ఇంగ్లండ్(England)తో స్వదేశంలో టెస్టులు ఆడనుంది. మొత్తం 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఫిబ్రవరి 2న విశాఖ వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించింది. యువ జట్టుతోనే: దక్షిణాఫ్రికాపై జరిగిన టెస్టు సిరీస్‌లో పుజారా, రహానే లేకుండానే ఆడిన భారత్.. మరోసారి అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. సఫారీలపై ఫెయిలైన ప్లేయర్లకు మరోసారి ఛాన్స్ ఇవ్వనుంది. యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌కు మరో ఛాన్స్ ఇవ్వనుంది. దక్షిణాఫ్రికాపై సిరీస్‌లో గిల్, అయ్యర్ ఘోరంగా విఫలమయ్యారు. అటు గిల్ విదేశీ గడ్డపై పదేపదే ఫెయిల్ అవుతుంటే.. శ్రేయస్ అయ్యర్ ఆటిట్యూడ్ షాట్లతో చికాకు పెట్టి ఔట్ అవుతున్నాడు. ఈ ఇద్దరి తీరు కొంతకాలంగా ఇలానే ఉన్నా సెలక్టర్లు మాత్రం ఛాన్స్ ఇస్తుండడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే స్పిన్ అస్త్రం: ఇండియాలో టెస్టు అంటే బాల్ బొంగరాలు తిరిగినట్టు గింగరాలు తిరుగుతుంది. బ్యాటర్లు కూడా డ్యాన్స్ వేయాల్సి వస్తుంది. మరోసారి అదే అస్త్రంతో భారత్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే తొలి రెండు టెస్టులకు ఏకంగా నలుగురు స్పిన్నర్లను సెలక్ట్ చేసింది. జడేజా, అశ్విన్‌తో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్‌యాదవ్‌ను ఎంపిక చేశారు. ఈ నలుగురిలో ముగ్గురు తుది జట్టులో ఉండడం ఖాయమే. అటు పేసర్లగా బుమ్రా, అవేశ్‌ఖాన్, సిరాజ్, ముఖేశ్‌కుమార్‌ను ఎంపిక చేశారు. అటు ముగ్గురు కీపర్లని సెలక్ట్ చేశారు. కేఎల్‌రాహుల్, భరత్‌తో పాటు ధ్రువ్‌జురెల్‌ని బ్యాకప్‌గా ఎంపిక చేశారు. మొదటి రెండు టెస్టులకు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్ ), గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, అయ్యర్, రాహుల్ (wk), భరత్ (wk), ధృవ్ జురెల్ (wk), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్. Also Read: IPLకు ముందే T20 వరల్డ్ కప్ టీమ్ ఫైనల్ లిస్ట్ రెడీ.. సెలెక్టర్ కామెంట్స్ వైరల్! WATCH: #cricket #cricket-news #india-vs-england మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి