Team India eye on 112 Year Record: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది. సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా పలు రికార్డులపై కన్నేసింది. ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డులు వచ్చి పడతాయి. ఈ సిరీస్‌లో భారత జట్టు ఇప్పటికే 3-1తో అజేయంగా ఆధిక్యంలో ఉంది. ధర్మశాలలో జరిగే ఐదో టెస్టులో విజయం సాధిస్తే ఓ ప్రత్యేక రికార్డును సమం చేయనుంది. భారత్ మొదటి టెస్ట్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసన విషయం తెలిసిందే. దీని తర్వాత రోహిత్ టీమ్ అదిగే కమ్‌బ్యాక్ చేసి మిగిలిన మూడు మ్యాచ్‌లను గెలుచుకుంది. ఇంతకి రోహిత్ టీమ్‌ను ఊరిస్తున్న ఆ రికార్డు ఏంటి?
112 ఏళ్ల రికార్డు సమం:
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి టెస్టు ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు రెండు జట్లు మాత్రమే స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాయి. మొదటి టెస్టు ఓడిపోయి మిగిలిన నాలుగు మ్యాచ్‌లను గెలుచుకున్న జట్టు రెండే. రెండు జట్లు ఇలా మూడుసార్లు చేశాయి. ఆస్ట్రేలియా రెండుసార్లు, ఇంగ్లండ్ ఒకసారి ఇలా చేశాయి. 112 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ చివరిసారి ఇలా చేసింది. 1912లో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన ఇంగ్లీష్ జట్టు అద్భుతంగా పునరాగమనం చేసి మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా దీనిని 1897/98, 1901/02లో చేసింది.
వాటే కమ్ బ్యాక్:
గత 112 ఏళ్లలో తొలి టెస్టులో ఓడిన తర్వాత సిరీస్‌లో మిగిలిన నాలుగు టెస్టుల్లోనూ విజయం సాధించిన తొలి జట్టుగా టీమిండియా కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో 106 పరుగులతో, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో 434 పరుగులతో, ఆ తర్వాత రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. చెప్పాలంటే భారత్ బాజ్‌బాల్ క్రికెట్‌కు చెక్ పెట్టింది. బాజ్‌బాల్ అంటే దూకుడుగా ఆడడం. స్టోక్స్, మెకల్లమ్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు వరుసగా మూడు టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.
Also Read: ఏపీలో డీఎస్సీ షెడ్యూల్ సస్పెండ్.. జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. !