INDIA VS ENGLAND 1st Test Hyderabad: ఈ నెల 25 నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సిరీస్ మొదలుకానుంది. తొలి టెస్టు హైదరాబాద్‌లోనే జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుండగా.. తరువాత నాలుగు రెడ్ బాల్ పోటీలు విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో జరుగుతాయి. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తగిన ఏర్పాట్లు చేసింది.
విద్యార్థులకు ఉచిత ప్రవేశం:
మ్యాచ్‌కు ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ మోహన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. HCA అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మ్యాచ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. 26 వేల టికెట్స్ ఇప్పటి వరకు విక్రయించినట్టు తెలిపారు. జింకనా గ్రౌండ్ లో టికెట్స్ విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రేపు(జనవరి 21) ఇరు జట్లు కూడా హైదరాబాద్ చేరుకుంటాయని.. ఈనెల 23న బీసీసీఐ అవార్డ్స్ పార్క్ హయత్ లో జరుగుతాయన్నారు. ఆధునాత హంగులతో స్టేడియాన్ని తీర్చి దిద్దినట్టు చెప్పుకొచ్చారు. దేశ సేవ చేస్తున్న ఆర్మీ-నావి అధికారులకు క్రికెట్ మ్యాచ్ చూపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ సారి మ్యాచ్ చూపిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ముందుగా స్కూల్ నుంచి అప్లయ్ చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తున్నామని.. విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. స్కూల్ పిల్లల కోసం డెస్క్ ఏర్పాటు చేశామని.. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ఇక తాజ్ డెక్కన్ హోటల్‌లో ఇంగ్లండ్ టీమ్ బస చేయనుండగా.. ఇండియా టీమ్ పార్క్ హయత్ హోటల్‌లో బస చేయనుంది.
పూర్తి షెడ్యూల్ -వేదికలు:
IND vs ENG 1వ టెస్ట్ : జనవరి 25-29 (గురువారం-సోమవారం) - రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్, 9:30 AM IST
IND vs ENG 2వ టెస్ట్: ఫిబ్రవరి 2-6 (శుక్రవారం-మంగళవారం) - డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం, 9:30 AM IST
IND vs ENG 3వ టెస్ట్: ఫిబ్రవరి 15-19 (గురువారం-సోమవారం) - సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్, ఉదయం 9:30 IST
IND vs ENG 4వ టెస్ట్: ఫిబ్రవరి 23-27 (శుక్రవారం-మంగళవారం) - JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచీ, 9:30 AM IST
IND vs ENG 5వ టెస్ట్: మార్చి 7-11 (గురువారం-సోమవారం) - హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల, 9:30 AM IST
Also Read: హస్తప్రయోగం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా..?
WATCH: