IND vs ENG : హైదరాబాద్ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ 420 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. భారత్‌కు 231 రన్స్‌ టార్గెట్‌ను సెట్ చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఒల్లి పోప్‌ 196 పరుగులుతో తృటిలో డబుల్ సెంచరీ మిస్‌ అయ్యాడు. భారత్‌ బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు.

New Update
IND vs ENG : హైదరాబాద్ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

IND vs ENG Hyderabad Test : భారత్‌(India) తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌(England) భారీ స్కోరు సాధించింది. 420 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. ఒల్లి పోప్‌ ఏకంగా 196 పరుగులు చేశాడు. తృటిలో డబుల్ సెంచరీ కోల్పోయాడు. 278 బంతులు ఆడిన పోప్‌ 21 ఫోర్లతో 196 రన్స్ చేశాడు. ఇక మిగిలిన ఇంగ్లండ్‌ ప్లేయర్లు ఎవరూ కూడా కనీసం హాఫ్‌ సెంచరీ మార్ఖ్‌ దాటలేదు. అయితే ఫోక్స్‌, హార్ట్‌లీ ఇద్దరూ తలో 34 పరుగులు చేశారు. భారత్‌ బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. అశ్విన్‌ మూడు వికెట్లు తీయ్యగా.. జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌ 420 రన్స్‌కు ఆలౌట్ అవ్వడంతో భారత్‌కు 231 రన్స్ టార్గెట్ రీచ్ అవ్వాల్సి ఉంది. ఇది నాలుగో రోజే కావడంతో రిజల్ట్‌ రావడం ఖాయమే. అయితే టీమిండియా(Team India) ఈ టార్గెట్‌ను ఛేజ్ చేస్తుందా లేదా కుప్పకూలుతుందానన్నది ఉత్కంఠగా మారింది.


అంతకముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 436 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal) 80 బంతుల్లో అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. రోహిత్‌(Rohit), గిల్‌ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరినా జైస్వాల్‌, రాహుల్‌, జడేజా అద్భుతంగా ఆడారు. జడేజా తన సహజ శైలికి భిన్నంగా టెస్టు ఫార్మెట్‌లో బ్యాటింగ్ చేశాడు. 180 బంతులు ఆడి 87 రన్స్ చేసి భారత్‌ తరుఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అక్షర్‌ పటేల్‌ 44 రన్స్ తో లాస్ట్‌లో భారత్‌ భారీ స్కోరుకు ఓ కారణం అయ్యాడు. ఇక రాహుల్‌ 123 బంతుల్లో 86 రన్స్ చేశాడు.


భారత్‌ బ్యాటర్లలో ఎవరూ కూడా వంద పరుగులు చేయకున్నా స్కోరు మాత్రం 400దాటడం విశేషం. అంటే అందరు తలో చెయ్యి వేశారని అర్థం. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌ ఇంగ్లండ్‌ను డామినేట్ చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Also Read: ఇది ఆటో బైక్! అటు త్రీవీలర్ గా.. ఇటు టూవీలర్ గా భలే ఉంది

Advertisment
తాజా కథనాలు