IND VS AUS: పోటెత్తిన అభిమానులు.. విశాఖ టీ20 ఫైట్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌ ఎవరిదంటే?

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 ఫైట్‌కు టాస్‌ పడింది. టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యవహరిస్తున్నాడు. ఇక విశాఖ ప్రజల చూపు మాత్రం తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మవైపే ఉంది.

New Update
IND VS AUS: పోటెత్తిన అభిమానులు.. విశాఖ టీ20 ఫైట్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌ ఎవరిదంటే?

వన్డే వరల్డ్‌కప్‌ ముగిసింది.. వెంటనే టీ20 సిరీస్‌ స్టార్ట్ అయ్యింది. ప్రపంచకప్‌ ముగిసిన నాలుగు రోజుల్లోనే ఆస్ట్రేలియాతో టీ20 సమారానికి భారత్ సిద్ధమైంది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ విశాఖలో జరుగుతోంది. టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇక విశాఖ పిచ్‌ ఫ్లాట్‌ ట్రాక్‌. ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన జట్టు 180 పరుగులు చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయని పిచ్‌ రిపోర్ట్ చెబుతోంది. అంటే ఆస్ట్రేలియాను 180లోపు మన బౌలర్లు కట్టడి చేయాల్సి ఉంటుంది.

తెలుగు కుర్రాడివైపే అందరి చూపు:
ఈ మ్యాచ్‌లో భారత్‌ నుంచి ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనున్నారు. ఇక వికెట్ కీపర్‌గా ఇషాన్‌ కిషాన్‌ని తీసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్‌తో మిడిలార్డర్‌ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. అటు స్పిన్నర్లగా అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ తమ సత్తా చూపించేందుకు రెడీ అయ్యారు. అక్షర్ పటేల్‌ ఇటీవల కాలంలో అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. బంతితో, బ్యాట్‌తో మెరుస్తూ ప్రత్యర్థలపై పైచేయి సాధిస్తున్నాడు. నిజానికి వరల్డ్‌కప్‌లో కూడా అక్షర్ ఆడాల్సి ఉంది. కానీ గాయం కారణంగా అతడి స్థానంలో అశ్విన్‌ను తీసుకున్నారు. ఇక పేసర్లగా అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ బంతిని పంచుకోనున్నారు. ఇక విశాఖ ప్రజల చూపు మాత్రం తిలక్‌ వర్మవైపే ఉంది. ఒత్తిడిలో తిలక్‌ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(w/c), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ

Also Read: రోహిత్ శర్మ నాటౌటా? హెడ్‌ క్యాచ్‌పై సోషల్‌మీడియాలో రచ్చ..!

WATCH:

Advertisment
తాజా కథనాలు