/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/dhoni-rinku-jpg.webp)
రింకూ సింగ్(Rinku Singh).. ఈ ఏడాది ఐపీఎల్‌లో కొత్త సంచలనం. ఓవర్‌లో 28 పరుగులు కావాలంటే వరుసగా ఐదు సిక్సులు కొట్టిన రింకూ సింగ్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. ఓడిపోయిందనుకున్న మ్యాచ్‌ను గెలిపించి ఔరా అనిపించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడే రింకు ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఐపీఎల్‌లో మంచి ఫినీషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ విశాఖ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. చివరి బంతికి ఒక్క పరుగు అవసరం కావాల్సి ఉండగా.. సిక్సర్ బాదాడు. అయితే అది నో బాల్ కావడంతో.. కావాల్సింది ఒక్క పరుగే కావడంతో నో బాల్‌ని కౌంట్‌కి ఒక పరుగు టీమ్ స్కోరులో యాడ్ అవుతుంది. దీంతో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరే ఇండియా విన్ ఐనట్లు లెక్క. దీంతో రింకూ కొట్టిన సిక్సర్ అతని ఖాతాలో పడలేదు.
This is one of the most fulfilling and heart warming pictures going around
The relationship between ABHISHEK NAYAR n RINKU SINGH
it was a partnership that started in 2018 during my time in KKR. Nayar always saw the potential in Rinku , he kept telling me, it was only a matter… pic.twitter.com/ia8nTJBElW
— DK (@DineshKarthik) November 24, 2023
ఐపీఎల్‌లో రూ.80లక్షలకు కొనుగోలు:
నిజానికి రింకూ సింగ్ 2018 నుంచే ఐపీఎల్(IPL)లో ఉన్నాడు. అయితే పెద్ద గుర్తింపు రాలేదు. అంతగా రాణించింది కూడా లేదు. రింకూ సింగ్‌ను 2018లో రూ.80 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్(KolKata Knight Riders) కొనుగోలు చేసింది. మొదటి సీజన్ గొప్పగా ఆడనప్పటికీ, అతని సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని..ఐపీఎల్ 2019లోనూ కంటీన్యూ చేశారు. 2018-19 రంజీ ట్రోఫీలో రింకూ రాణించాడు. ఆ సీజన్‌లో మూడో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 10 ఇన్నింగ్స్‌లో 953 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి (163*, 149, 149, 150) పరుగులు చేశాడు.
This World is not ready for the Lord Rinku Singh in 2024🔥💜 #RinkuSingh #Auction | #IPLAuction | #SquidGame | #earthquake | pic.twitter.com/3Srvo51ruB
— Obaid Subhan (@Obaidsubhan) November 23, 2023
ఆ మ్యాచ్‌తో మలుపు:
ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్ అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. ఒక్కసారిగా రింకూ టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఏప్రిల్ 9, 2023న, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకు రికార్డ్-బ్రేకింగ్ ఫీట్‌ను సాధించాడు. చివరి ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టి 29 పరుగులను విజయవంతంగా ఛేదించాడు. టోర్నమెంట్ చరిత్రలో చివరి ఓవర్‌లో అత్యధిక ఛేజ్ చేసిన రన్స్ ఇవి. అప్పటి నుంచే టీమిండియాకు మరో ధోనీ(Dhoni) దొరికేశాడని ఫ్యాన్స్ లెక్కలు కట్టేశారు. ఇక తాజాగా విశాఖ మ్యాచ్‌లోనూ రాణించడంతో టీమిండియాకు ఫినీషర్ లోటు తీరినట్లేనని చెబుతున్నారు.
Also Read: క్రికెట్ అంపైర్ అవ్వడం ఎలా? జీతం తెలుసుకుంటే షాక్ అవుతారు!
WATCH: