IND vs AUS: చెలరేగిన భారత బ్యాట్స్‎మెన్.. ఆసిస్ ఎదుట భారీ లక్ష్యం

తిరువనంతపురంలో భారత బ్యాట్స్ మెన్ రెచ్చిపోయి ఆడడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. జైశ్వాల్, రుతురాజ్, ఇషాన్ కిషన్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.

IND vs AUS: చెలరేగిన భారత బ్యాట్స్‎మెన్.. ఆసిస్ ఎదుట భారీ లక్ష్యం
New Update

IND vs AUS: తిరువనంతపురంలో భారత బ్యాట్స్ మెన్ రెచ్చిపోయి ఆడడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. జైశ్వాల్, రుతురాజ్, ఇషాన్ కిషన్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐదు టీ20 సిరీస్ లో భాగంగా జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు యశస్వి, రుతురాజ్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆసిస్ బౌలింగ్ ను ఊచకోత కోసిన యశస్వి జైశ్వాల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సేన్ అబ్బాట్ వేసిన నాలుగో ఓవర్లో అయితే వరుసగా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన ఈ యువ ఓపెనర్ 24 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తిచేశాడు. క్రీజులో ఉన్నంత సేపూ అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిన యశస్వి (25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు) ఐదో ఓవర్ చివరి బంతికి నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో జంపాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలివికెట్ కు రుతురాజ్ తో కలిసి 77 పరుగులు జోడించాడు.

ఇది కూడా చదవండి: ధోనీ ఫ్యాన్స్‎కు పండుగే.. రిటెన్షన్ లిస్టులో ‘మిస్టర్ కూల్’

అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా కంగారూ బౌలర్లకు ధాటిగా జవాబిచ్చాడు. రుతురాజ్ కూడా బ్యాట్ జళిపించడంతో భారత స్కోరు 10 ఓవర్లలోనే 100 పరుగులు దాటింది. భారీ షాట్లతో విరుచుకుపిన ఇషాన్ 32 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి స్టాయినిస్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 15.2 ఓవర్లలో రెండు వికెట్లకు 164 పరుగులు. రెండో వికెట్ కు రుతురాజ్, ఇషాన్ కిషన్ కలిసి 87 పరుగులు జోడించారు. మరో ఎండ్ లో రుతురాజ్ నిలదొక్కుకుని స్థిరంగా పరుగులు తీస్తూ, వీలైనప్పుడు బంతిని బౌండరీ దాటిస్తూ స్కోరును ముందకు నడిపాడు. చివరి ఓవర్ వరకూ క్రీజులో ఉన్న గైక్వాడ్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. ఇషాన్ తర్వాత సూర్యకుమార్ వస్తూవస్తూనే రెండు సిక్సర్లు బాదాడు. 19 పరుగులు చేసి ఔటయ్యాడు. లాస్ట్ మ్యాచ్ హీరో రింకూ సింగ్ 18.3 ఓవర్ల వద్ద సిక్సర్ బాది స్కోరును డబుల్ సెంచరీ దాటించాడు. మరోసారి కంగారూ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన రింకూ 9 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్సర్లతో 31 పరుగులు రాబట్టాడు.

#ruturaj-gaikwad #yashaswi-jaiswal #ind-vs-aus-2nd-t20i
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe