Exit Poll 2024 : తెలంగాణలో లెక్కలు తలకిందులు.. ఇండియా టుడే సంచలన సర్వే! ఏపీ, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా సంచలన సర్వే బయటపెట్టింది. తెలంగాణలో బీజేపీకి 11-12, కాంగ్రెస్ కు 4-6, బీఆర్ఎస్ 0-1 సీట్లు వస్తాయని చెప్పింది. ఏపీలో వైసీపీ 2-4, టీడీపీ కూటమి 21-23 లోక్ సభ సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది. By srinivas 01 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి India Today-Axis My India : తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో (Telangana Parliament Elections) సంచలన ఫలితాలు వెల్లడికాబోతున్నట్లు ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా తెలిపింది. శనివారం పోలింగ్ ముగియగానే ఎగ్జి్ట్ పోల్స్ (Exit Polls) విడుదలయ్యాయి. ఇందులో భాగంగానే ఇండియా టుడే (India Today) యాక్సిస్ తెలంగాణలో బీజేపీకి 11 నుంచి 12 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు కేవలం 4 నుంచి 6 స్థానాలకు పరిమితమవుతుందని, బీఆర్ఎస్ జీరో లేదా ఒక స్థానం గెలుచుకుంటుందని సర్వే ఆధారంగా వెల్లడించింది. ఇక MIM ఒక స్థానంలో గెలుస్తుందన్న ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా బీఆర్ఎస్ కు 13 ఓటు శాతం వస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 43 శాతం, కాంగ్రెస్‌కు 39శాతం ఓట్లు పడ్డట్లు పేర్కొంది. అలాగే ఏపీలో వైసీపీకి కేవలం 2-4 లోక్ సభ స్థానాలు వస్తాయని ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా (Axis My India) సర్వే తేల్చి చెప్పింది. బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు, టీడీపీకి 13 నుంచి 15 స్థానాలు, జనసేన పోటీ చేసిన 2 స్థానాల్లో గెలుస్తుందని ఈ సర్వే వెల్లడించింది. ఇక ఎన్డీఏకు 53 శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది. వైసీపీకి 41 శాతం ఓటింగ్, కాంగ్రెస్ 4 శాతం ఓటింగ్, ఇతరులకు 2 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. పూర్తి వివరాలకోసం ఈ వీడియో చూడండి. Also Read : ఏపీ ఎగ్జిట్ పోల్స్.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు #telangna #andhra-padesh #exit-polls #india-today-axis-my-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి