Mobiles : భారత్‌ లో 84 శాతం మంది నిద్ర లేచిన 15 నిమిషాల్లోనే మొబైల్ ని చెక్ చేస్తున్నారు!

బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక లో సుమారు 84 శాతం మంది భారతీయులు నిద్ర లేచిన 15 నిమిషాల్లోనే తమ ఫోన్‌ లను చెక్‌ చేసుకుంటున్నారు. తమ ఉదయపు ఆహ్లాదకరమైన సమయాన్ని 31 శాతం స్మార్ట్‌ఫోన్ల కోసం వెచ్చిస్తున్నారు.

New Update
Mobiles : భారత్‌ లో 84 శాతం మంది నిద్ర లేచిన 15 నిమిషాల్లోనే మొబైల్ ని చెక్ చేస్తున్నారు!

Mobiles Usage : ప్రస్తుతం రోజుల్లో(Now A Days) తిండి , నిద్ర లేకుండా అన్న ఉండగలుగుతున్నారు కానీ చేతిలో మొబైల్‌(Mobile) లేకపోతే మాత్రం అసలు ఉండలేకపోతున్నారు. మొబైల్‌ అనేది శరీరంలో ఓ భాగం అయిపోయింది. అరచేతిలో ప్రపంచాన్ని చూసేస్తూ చుట్టు పక్కల వారిని, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటం మానేస్తున్నారు.

రోజులో సుమారు 18 గంటలు మొబైల్‌ తో గడిపేవారు చాలా మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నిద్రలో కూడా మొబైల్‌ ని తలకింద పెట్టుకుని పడుకునే వారు కూడా చాలా మందే ఉన్నారు. తాజాగా బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(Boston Consulting Group) ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక లో సుమారు 84 శాతం (84 Percent)  మంది భారతీయులు(Indians) నిద్ర లేచిన 15 నిమిషాల్లోనే తమ ఫోన్‌ లను చెక్‌ చేసుకుంటున్నారు.

తమ ఉదయపు ఆహ్లాదకరమైన సమయాన్ని 31 శాతం స్మార్ట్‌ఫోన్ల(Smart Phones) కోసం వెచ్చిస్తున్నారు. అంతే కాకుండా తమ మొబైల్స్‌ ను రోజులో 80 సార్లు తనిఖీ చేస్తారని కూడా నివేదిక వెల్లడించింది. 'రీఇమేజినింగ్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్: ఫోన్‌ను స్మార్ట్‌గా మార్చడంలో 'సర్ఫేసెస్' ఎలా కీలక పాత్ర పోషిస్తాయి' అనే పేరుతో రూపొందించిన నివేదిక, కంటెంట్ స్ట్రీమింగ్ కోసం ప్రజలు తమ సమయాన్ని 50 శాతం స్మార్ట్‌ఫోన్‌లపై వెచ్చిస్తున్నారని పేర్కొంది.

నివేదిక ప్రకారం, స్మార్ట్‌ఫోన్‌లపై గడిపే సమయం 2010లో దాదాపు రెండు గంటల నుండి సుమారు 4.9 గంటలకు పెరిగింది. 2010లో, ఫోన్‌లపై గడిపిన 100% సమయం టెక్స్ట్‌లు, కాల్‌ల్లోనే గడుపుతున్నారు. ఇది 2023లో 20-25 శాతం మాత్రమే.

సెర్చింగ్‌ , గేమింగ్, షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, వార్తలతో గడపడం రెండవ స్థానాన్ని ఆక్రమించింది. 35 ఏళ్లు పైబడిన వారి కంటే 18-24 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్(Instagram Reels), యూట్యూబ్ షార్ట్‌లు(YouTube Shorts) మొదలైన షార్ట్ ఫారమ్ వీడియోలపై ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నట్లు తెలిసింది.

Also Read : మరో చరిత్ర సృష్టించడానికి రెడీ అయిన ఇస్రో.. నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్‌ 14!

Advertisment
Advertisment
తాజా కథనాలు