ఇజ్రాయెల్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఐరాసాలో తీర్మానం.. భారత్ ఓటు ఎటువైపంటే

పాలస్తీనాలో ఇజ్రాయెల్ కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు భారత్‌తో సహా 145 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. దీంతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. అమెరికాతో సహా 8 దేశాలు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి.

New Update
ఇజ్రాయెల్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఐరాసాలో తీర్మానం.. భారత్ ఓటు ఎటువైపంటే

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంలో మరొకసారి ఆచితూచిగా వ్యవహరించింది. పాలస్తీనాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ విషయంలో భారత్.. యూఎన్‌ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. దాదాపు 145 దేశాలు ఇందుకు అనుకూలంగా ఓటు వేశాయి. ఆక్రమిత పాలస్తీనా భూభాగం, తూర్పు జెరూసలెం, సిరియాకు చెందిన గోలాన్‌ హైట్స్‌లో ఇజ్రాయెల్‌ సెటిల్మెంట్‌ కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ఆమోదం పొందింది.

Also Read: ప్రియురాలిని 111 సార్లు కత్తితో పొడిచిన హంతకుడు.. క్షమాభిక్ష పెట్టిన పుతిన్..

ఈ తీర్మానానికి 145 దేశాలు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ.. 18 దేశాలు మాత్రం తటస్థంగా ఓటు వేశాయి. మరోవైపు.. కెనడా, హంగేరీ, ఇజ్రాయెల్‌, మార్షల్‌ఐలాండ్స్‌, ఫెడరేటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ మైక్రోనేషియా, నౌరు, అమెరికా దేశాలు మాత్రం ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఇదిలాఉండగా.. ఇటీవలే ఇజ్రాయెల్‌-హమాస్‌ యద్ధాన్ని వెంటనే ఆపేయాలని కోరుతూ జోర్డాన్‌ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ ఓటింగ్‌కు భారత్ హాజరుకాలేదు. ఇందులో హమాస్ చేస్తున్న అనాగరిక చర్యలను పేర్కొనకపోవడాన్ని ఇండియా వ్యతిరేకించింది. అప్పట్లో ఈ తీర్మానం ఓటింగ్‌కు ఇండియాతో సహా.. 45 దేశాలు గైర్హాజరయ్యాయి. మరో 120 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు