Pakistan Parliament : పాకిస్థాన్ పార్లమెంట్‌లో మరోసారి భారత్(India) కు ప్రశంసలు వచ్చాయి. భారత్ చంద్రునిపై అడుగు పెట్టగా.. తమ పిల్లలు డ్రైనేజీలో పడి చనిపోతున్నారని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్థాన్(MQM-P) పార్టీ ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్(Sayyad Mustafa Kamal).. పార్లమెంటులో బుధవారం కరాచీలో సౌకర్యాల కొరతను ఎత్తిచూపుతూ పాకిస్థాన్‌ను భారత్‌తో పోల్చారు. 'మన టీవీ స్క్రీన్‌లలో భారత్ చంద్రునిపైకి చేరుకుందని వార్తలు చూస్తుంటాం, కేవలం రెండు సెకన్ల తర్వాత కరాచీలో డ్రైనేజీలో పడి ఒక పిల్లవాడు చనిపోయాడని వార్తలు చూస్తున్నామని' సయ్యద్ అన్నారు.
Also Read : మీటింగ్ నుంచి తిరిగి వస్తుండగా ప్రధాని పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు!
'కరాచీ పాకిస్థాన్‌కు ఆదాయం తెచ్చిపెట్టే ఇంజిన్ లాంటిదని సయ్యద్ అన్నారు. పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి రెండు ఓడరేవులు ఇక్కడే ఉన్నాయని.. కానీ కరాచీకి 15 ఏళ్లుగా మంచినీరు అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కరాచీకి రాజధానిగా ఉన్న సింధ్ ప్రావిన్స్‌లో కనీసం 70 లక్షల మంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదని ఆరోపించారు. పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ మితవాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ పార్లమెంటులో మాట్లాడుతూ.. భారత్ ఒక వైపు ప్రపంచ సూపర్ పవర్(World Super Power)గా అవతరిస్తుండగా మరోవైపు పాకిస్తాన్ తనను తాను సంక్షోభం నుంచి రక్షించమని ప్రపంచాన్ని వేడుకుంటోందని వ్యాఖ్యానించారు.
Also Read : ఉద్యోగం నుంచి తొలగించినా 60 రోజులకు పైగా అమెరికాలో ఉండొచ్చు.. USCIS సిస్టమ్ యాక్షన్ ప్రకటన!