POK:పీవోకేలో బ్రిటిష్ రాయబారి పర్యటన..తీవ్ర అభ్యంతరం

ఆక్రమిత కాశ్మీర్‌లో బ్రిటీష్ రాయబారి పర్యటించడం తీవ్ర చర్చకు దారి తీసింది. బ్రిటీష్ హైకమీషనర్ జానె మారియట్ జనవరి 10న పీవోకేలో పర్యటించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

POK:పీవోకేలో బ్రిటిష్ రాయబారి పర్యటన..తీవ్ర అభ్యంతరం
New Update

British High commissioner:బ్రిటీష్ హైకమీషనర్ భారత పర్యటన చర్చనీయాంశంగా మారింది. యూకే విదేశాంగ కార్యాలయ సిబ్బంది, హైకమీషనర్ జానె మారియట్ జనవరి 10న పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మీర్‌పూర్లో పర్యటించారు. ఇది ఎంత మాత్రం ఆమోదయేగ్యం కాదని భారత విదేశాంగశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. మన దేశ సౌర్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను ఈ చర్య ఉల్లంఘిస్తోందని అంది. దీనిపై తమ ఆందోళనను బ్రిటీష్ హైకమిషన్ దృష్టికి తీసుకెళ్ళామని చెప్పింది. జమ్మూ కాశ్మీర్‌, లడఖ్ ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగాలే అని కేంద్రవిదేశాంగ శాఖ ప్రకటించింది.

Also Read:హౌతీలపై అమెరికా దాడులు మరింత తీవ్రతరం

జనవరి 10న పీవోకేలోని మీర్పూర్‌ను సందర్శించిన బ్రిటీష్ హైకమీషనర్ జానె మారియట్ దానికి సంబంధించి ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. బ్రిటన్‌లో పాక్ సంతతికి చెందినవారిలో 70శాతం మంది మీర్‌పూర్‌ నుంచే ఉన్నారు. అందుకే జానె మారియట్ ఇక్కడ పర్యటించారని పాక్ మీడియా కథనాలు తెలిపాయి. ప్రవాసుల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడం చాలా కీలకం అని జానెమారియట్ అన్నారు. అయితే భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలును తీవ్రంగా ఖండించింది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. జానె మారియట్ అలా ఎలా అంటారని నెటిజన్లు మండిపడుతున్నారు. పీవోకే భారత్‌లో భాగమని...దాన్ని పాక్‌దని ఎలా అంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జానె మారియట్ మీద చర్యలు తీసుకోవాలని యూకే ప్రధాని రిషి సునాక్‌ని డిమాండ్ చేస్తున్నారు.

అమెరికా రాయబారి కూడా...

అంతకు ముందు అక్టోబర్‌లో అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్ కూడా పీవోకేలో పర్యటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో బ్లోమ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్ళి అక్కడ కొన్ని సమావేశాలు కూడా నిర్వహించారు. అప్పుడు కూడా భారత విదేశాంగ్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు భారత దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని సూచించింది.

#india #pok #kashmir #british-high-commissioner
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe