S. Jaishankar: ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు: ఎస్‌. జై శంకర్

సింగపూర్‌లో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్‌ ఏషియన్ స్టడీస్‌లో ప్రసంగిస్తూ పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుపర్చుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసీచూడకుండా వదిలేయలేమని అన్నారు.

S. Jaishankar: ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు: ఎస్‌. జై శంకర్
New Update

భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్‌ ఏషియన్ స్టడీస్‌లో ప్రసంగిస్తూ పాకిస్థాన్‌, చైనా చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. ' పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థతిలో ఇండియా లేదు. ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతకాలి.

Also Read: కేజ్రీవాల్ అరెస్ట్.. హైకోర్టులో పిటిషన్

చూసీచూడకుండా వదిలేయలేం

ఉగ్రవాదం నుంచి తప్పించుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు.. అలాగే తిరిగి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ప్రతిదేశం కూడా ఒక మంచి, సుస్థిరమైన పొరుగు దేశం ఉండాలని అనుకుంటుంది. ఇది కుదరకపోతే కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైన ఉండాలని కోరుతుంది. అయితే పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుపర్చుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసీచూడకుండా వదిలేయలేమని' జైశంకర్ అన్నారు.

అది హస్యాస్పదం

చైనా-భారత్ సరిహద్దులో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉన్న తవాంగ్ ప్రాంతానికి సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేలా 'సేలా' అనే అనే సొరంగ మార్గాన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. కానీ ఇది తమ భూభాగమని చైనా అంటోంది. భారత్‌ అడుగులు సరిహద్దు వివాదాన్ని ముదిరేలా చేస్తాయని పేర్కొంది. అయితే ఈ అంశంపై కూడా జైశంకర్ తన ప్రసంగంలో స్పందించారు. చైనా చేస్తున్న ఈ వాదన హస్యాస్పదమని.. అరణాచల్‌ప్రదేశ్‌ భారత్‌కు చెందిన సహజ భూభాగమని స్పష్టం చేశారు.

మరోవైపు చైనా ఇలా.. సరిహద్దు వివాదంపై నోరు పారేసుకోవడంపై.. అమెరికా కూడా కూడా భారత్‌కు మద్దతిచ్చింది. చైనా చేసిన వ్యాఖ్యలను ఖండించింది. అయితే భారత్‌ - చైనా సరిహద్దు వివాదంతో వాషింగ్టన్‌కు ఎలాంటి సంబంధం లేదని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్ పేర్కొన్నారు. అయితే చైనా అరుణాచల్‌ప్రదేశ్‌ భూభాగం మాదే అని చెప్పడం ఇదేం కొత్త కాదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి వాదనలే చేస్తోంది. అంతేకాదు పలుమార్లు అరుణాచల్‌ప్రదేశ్‌ భూభాగాన్ని తమ దేశ మ్యాప్‌లో కలిపి వాటిని విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

దీనిని సెక్స్ టాయ్ గా పరిగణించలేం.. హైకోర్టు కీలక తీర్పు!

#singapure #s-jaishankar #pakistan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe