ఉత్తర భారతదేశాన్ని (North India) భారీ వర్షాలు వణికిస్తున్నాయి.దేశరాజధాని ఢిల్లీతో సహా..ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్,హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ సహా ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. మరికొన్ని వాహనాలు లోయలో పడిపోయాయి.
పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదులు
యమునా నదితో(Yamuna River) సహా పలు నదులన్నీ పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.దీంతో వరద పోటెత్తి పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో(Video) చూస్తే వరదలు ఎలా పోటెత్తుతున్నాయో పూర్తిగా అర్థమైపోతుంది.పెద్ద,పెద్ద మొద్దుల్ని సైతం రోడ్డు మీదకు భారీ వరద లాక్కొచ్చి పడేసింది.దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు.
నానా ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు
భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలన్నీ నీటమునిగాయి.దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు.అంతేకాకుండా నిత్యవసర వస్తువుల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితి. కనీసం ఇళ్లల్లో కరెంట్ లేక నానా ఇబ్బందులకు గురవుతున్నట్లు అంటూ స్థానికులు వాపోతున్నారు.ఇప్పటికైనా త్వరితగతిన చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.