అది తెలివి తక్కువతనమే.. ఫైనల్లో భారత్ ఓటమిపై అంబటి రాయుడు

వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఓటమిపై మాజీ ఆటగాడు అంబటి రాయుడు తన అభిప్రాయం వెల్లడించారు. పిచ్‌ నెమ్మదిగా ఉండడం వల్లే భారత్‌ ఓడిపోయింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో పిచ్‌ మొదటి నుంచి ఆఖరిదాకా ఒకేలా ఉండడమే మంచిది. ఫైనల్లో పిచ్‌ను ఇలా తయారు చేయడం తెలివి తక్కువతనమే అన్నారు.

అది తెలివి తక్కువతనమే.. ఫైనల్లో భారత్ ఓటమిపై అంబటి రాయుడు
New Update

2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా ఓడిపోవడంతో కోట్లాదిమంది భావోద్వేగానికి లోనయ్యారు. ఈసారి తప్పకుండా భారత్ గెలుస్తుందని భావించి ఎన్నో కలలు కన్న అభిమానులను భారత్ టీమ్ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఫైనల్ కు ముందు ఎంతో బలంగా కనిపించిన ఇండియన్ టీమ్ మన స్టేడియంలో మన క్రౌడ్ మధ్యలో ఓడటాన్ని జనాలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ లవర్స్ తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ఇండియా ఓటమికి పలు కారణాలు వెల్లడిస్తున్నారు. బ్యాటింగ్ లో అందరూ ఫెయిల్ అయ్యారని, బౌలింగ్ లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారని చెబుతున్నారు. అయితే తాజాగా భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు భారత్ ఓటమిపై తన అభిప్రాయం వెల్లడించారు.

ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంబటి రాయుడు.. ప్రపంచకప్‌ ఫైనల్లో పిచ్‌ నెమ్మదిగా ఉండడం వల్లే భారత్‌ ఓడిపోయిందని అన్నారు. ‘భారత్‌, ఆస్ట్రేలియా ఆడిన ఫైనల్ మ్యాచ్ పిచ్‌ చాలా నెమ్మదిగా ఉంది. నిజానికి పిచ్‌ ఇలా తయారు చేయాలన్నది ఎవరి ఆలోచనో నాకు తెలియదు. కనీసం బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సమానంగా అనుకూలించే పిచ్‌ తయారు చేయాల్సింది. ఎందుకంటే ఆసీస్‌తో పోలిస్తే భారతే చాలా బలంగా ఉంది. కానీ తుది పోరులో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయింది. ఎలాంటి జట్టునైనా ఓడించే నైపుణ్యం, సత్తా టీమ్‌ఇండియాకు ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో పిచ్‌ మొదటి నుంచి ఆఖరిదాకా ఒకేలా ఉండడమే మంచిది. టాస్‌కు కూడా ప్రాధాన్యం ఉండకూడదు. అయితే ఫైనల్లో పిచ్‌ను ప్రణాళిక ప్రకారమే ఇలా తయారు చేస్తే అది తెలివి తక్కువతనమే' అంటూ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇక 2003లోనూ ఆస్ట్రేలియా మీద ఓడిపోయిన భారత్ ఈసారి ప్రతికారం తీర్చకుంటుందని, అందరూ భావించారు. కానీ అలా జరగకపోవడంతో అందరిలాగే తాను బాధపడ్డట్లు తెలిపారు.

Also read : రాయలసీమ రైతుకు అంతర్జాతీయ గుర్తింపు.. ‘రియల్‌ హీరోస్‌’ జాబితాలో చోటు

ఇదిలావుంటే.. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత టాపార్డర్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరి విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మన జట్టు టాప్ 3 బ్యాటర్లు 50+ స్కోర్లు సాధించడం విశేషం. ఇక భారీ ఛేదనలో ఆసీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులకే పరిమితమైంది.

#ambati-rayudu #india-lost #world-cup-final
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe