Plastic production: ప్రపంచంలోనే ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 2, బంగ్లాదేశ్ 3, రష్యా 4, బ్రెజిల్ 5 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇండియాలో ప్రతియేటా 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తయారవుతుండగా.. 8 దేశాల నుంచి ప్రపంచంలో సగానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. నైజీరియాలోని లాగోస్ ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్న నగరంగా గుర్తించారు. ఢిల్లీ, కరాచీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఇక ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే జాబితాలో నైజీరియా, ఇండోనేసియా, చైనా ముందంజలో ఉండగా అమెరికా 90, బ్రిటన్ 135వ స్థానంలో నిలిచాయి. ప్రపంచం మొత్తం మీద ఏటా 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, మూడింట రెండు వంతులు దక్షిణ భూగోళానికే చెందినవిగా అధ్యయనం పేర్కొంది.