India Flag in POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్ నిరసనలతో మారుమోగుతోంది. అక్కడ నిరసనల మధ్య జై భారత్ నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. తొలిసారిగా నిరసనకారులు భారతదేశ జెండాతో ప్రదర్శన చేశారు. ద్రవ్యోల్బణం, విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో 4 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. పీఓకే కోసం 23 బిలియన్ల పాకిస్తానీ రూపాయల (718 కోట్ల భారత రూపాయలు) ప్యాకేజీని ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రకటించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు. పాకిస్తాన్ మీడియా డాన్ న్యూస్ ప్రకారం, సహాయ ప్యాకేజీ ప్రకటించిన కొద్దిసేపటికే, పాకిస్తాన్ రేంజర్లు టియర్ గ్యాస్ షెల్స్ విడుదల చేసి నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ సమయంలో, ముగ్గురు మరణించారు, 6గురు గాయపడ్డారు.
పూర్తిగా చదవండి..India Flag in POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత జెండా.. జై భారత్ నినాదాలు.. ఎందుకంటే..
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిరసనల మధ్య భారత్ అనుకూల నినాదాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా భారత జెండాను తొలిసారిగా నిరసనకారులు ప్రదర్శించడం పాక్ ప్రభుత్వాన్ని ఆందోళనలో పడేసింది.
Translate this News: