IND vs SA ODI: ఆడుతూ.. పాడుతూ... సఫారీలతో తొలివన్డేలో భారత్‌ అలవోక విజయం

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ లో భారత్‌ శుభారంభం చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించి జోహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అలవోకగా విజయం సాధించింది. భారత బౌలర్లు విజృంభించి సఫారీల పతనాన్ని శాసించగా, యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ రాణించారు.

New Update
IND vs SA ODI: ఆడుతూ.. పాడుతూ... సఫారీలతో తొలివన్డేలో భారత్‌ అలవోక విజయం

IND vs SA ODI: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ లో భారత్‌ శుభారంభం చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించి జోహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అలవోకగా విజయం సాధించింది. భారత బౌలర్లు విజృంభించి సఫారీల పతనాన్ని శాసించగా, యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ రాణించారు. మొత్తంగా కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో యువ జట్టు ప్రదర్శన ఔరా! అనిపించేలా ఉంది.

ఇది కూడా చదవండి: ముంబై టీమ్‌లో ఇంటర్నెల్‌ వార్‌? బుమ్రా, సూర్య పోస్టులు వైరల్‌!

టాస్‌ ఓడి మొదట ఫీల్డింగ్‌కు దిగిన భారత్‌ సౌతాఫ్రికాను 116 పరుగుల అతి స్వల్ప స్కోరుకే కట్టడి చేయడం విశేషం. అనంతరం భారత్‌ 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేజింగ్‌లోనాలుగో ఓవర్‌లోనే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ వికెట్‌ కోల్పోయినప్పటికీ.. కెరీర్‌లో తొలి వన్డే మ్యాచ్‌ ఆడుతున్న సాయి సుదర్శన్‌ (43 బంతుల్లో 55 నాటౌట్‌, 9 ఫోర్లు)తో, శ్రేయస్‌ అయ్యర్‌ (45 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించడంతో భారత జట్టు లక్ష్యాన్ని ఊదిపడేసింది; 8 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను తన చేతిలోకి తీసుకుంది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్‌ ప్రొటిస్‌ జట్టుకు మరో చాన్స్‌ ఇవ్వలేదు. అనంతరం సాయి కూడా తోడయ్యాడు. 13వ ఓవర్లో వరుస బౌండరీలతో హోరెత్తించిన సాయి వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ అయ్యర్‌తో కలిసి వేగంగా పరుగులు సాధించాడు.

ఇది కూడా చదవండి: ముంబై ఇండియన్స్ కు షాకిచ్చిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్.. అంత కోపం ఎందుకంటే!

ఈ క్రమంలో 16వ ఓవర్‌లో సాయి హాఫ్‌సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కెరీర్‌ తొలి వన్డేలోనే 50 పరుగులు పూర్తిచేసుకున్న ఘనత సాధించాడు. ఆ వెంటనే వరుసగా ఫోర్‌, సిక్సర్‌ బాదిన శ్రేయస్‌ అయ్యర్‌ కూడా హాఫ్‌ సెంచరీ లాంచనం పూర్తిచేశాడు. 88పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యం అనంతరం మిల్లర్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ విజయం ముంగిట పెవిలియన్‌కు చేరాడు. తర్వాతి కార్యక్రమాన్ని తిలక్‌వర్మతో కలిసి సాయి సుదర్శన్‌ పూర్తిచేశాడు.

అంతకుముందు అర్ష్‌దీప్‌ ఐదు వికెట్లు, అవేశ్‌ ఖాన్‌ నాలుగు వికెట్లతో నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికా 116 పరుగులకే చేతులెత్తేసింది. ఈ విక్టరీతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే మంగళవారం జరగనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు