IMD: ఈసారి వర్షపాతం అధికమే.. చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ!

ఈ ఏడాది రుతుపవనాలు దేశంలోకి ముందుగానే వచ్చే అవకాశాలన్నట్లు వాతావరణశాఖ నిపుణులు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి హిందూ మహాసముద్రం డైపోల్‌ (ఐఓడీ), లానినా పరిస్థితులు ఒకేసారి రానుండడంతో వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

New Update
IMD: ఈసారి వర్షపాతం అధికమే.. చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ!

IMD: మండే ఎండలతో, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది రుతుపవనాలు దేశంలోకి ముందుగానే వచ్చే అవకాశాలన్నట్లు వాతావరణశాఖ నిపుణులు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి హిందూ మహాసముద్రం డైపోల్‌ (ఐఓడీ), లానినా పరిస్థితులు ఒకేసారి రానుండడంతో వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు స్థిరంగా లేకపోవడాన్ని ఐఓడీ అంటారు. మధ్య, తూర్పు పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా చల్లాగా మారటాన్ని లానినా అని పేర్కొంటారు. ఈ రెండు కూడా ఒకేసారి సంభవించడం అనేది అత్యంత అరుదైన విషయమని, ఇది నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని బాగా ప్రభావితం చేస్తుందని తెలిపారు.

సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్‌ మధ్య నమోదయ్యే అత్యధిక వర్షపాతం ఈసారి అంతకన్నా ముందే నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు పశ్చిమ, వాయవ్య భారతంలో ఎక్కువకాలం కొనసాగే అవకాశాలున్నాయని నిపుణులు తెలిపారు. దీంతో ఈ ఏడాది వర్షపాతం భారీగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

Also read: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి!

Advertisment
తాజా కథనాలు