అప్పటి వరకు ఉల్లి ఎగుమతులను నిషేదించిన భారత్‌!

భారత దేశం నుంచి ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులను డిసెంబర్‌ 8 నుంచి నిషేధం విధిస్తున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది

అప్పటి వరకు ఉల్లి ఎగుమతులను నిషేదించిన భారత్‌!
New Update

దేశంలో ఉల్లి సరఫరాను పెంచేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టింది. ఉల్లి ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతుల పై వచ్చే ఏడాది మార్చి వరకు నిషేదాన్ని కూడా విధిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

''ఉల్లిపాయల ఎగుమతి విధానం..మార్చి 31 2024 వరకు నిషేధించినట్లు డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్ లో తెలిపింది. దేశ రాజధానిలో స్థానిక విక్రేతలు కిలో ఉల్లిని ప్రస్తుతం రూ. 70-80 కి అమ్ముతున్నారు. దీనికి ముందు వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు రిటైన్‌ మార్కెట్‌ లో ఉల్లి కేజీ రూ. 25 చొప్పను అమ్మాలని కేంద్రం అక్టోబర్‌ నెలలోనే నిర్ణయించినట్లు సమాచారం.

అక్టోబర్ 28 నుంచి డిసెంబర్‌ 31 వరకు ఉల్లి ఎగుమతులపై టన్నుకు కనిష్ట ఎగుమతి ధర ని సుమారు 800 డాలర్లుగా విధించింది. ఆగస్టు నెలలో డిసెంబర్‌ 31 వరకు ఉల్లి పై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ నోటిఫికేషన్‌ ముందు వరకు కూడా లోడైన ఉల్లిపాయల షిప్‌మెంట్ ల ఎగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుందని ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్‌ లో వివరించింది.

ప్రస్తుతం దేశంలో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర కేజీ ఎప్పుడో రూ.50 కి డాటిపోయింది. హైదరాబాద్ లో అయితే 2 కిలోలు 130 నుంచి 140 వరకు అమ్ముతున్నారు. వాటిని నియంత్రించేందుకు కేంద్రం ఇప్పుడు ఎగుమతులను నిషేధించింది.
ఈ నిషేధం అమలు డిసెంబర్‌ 8 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది.

ఇప్పటికే లోడ్‌ అయిన ఉల్లి ఎగుమతులకు ఇతర దేశాల నుంచి అభ్యర్థనలు వస్తే కనుక భారత ప్రభుత్వం అనుమతులిస్తే..ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని ట్రేడ్‌ నోటిఫికేషన్‌ లో తెలిపింది. భారత మార్కెట్లో ఉల్లి ధరల్ని అదుపు చేసేందుకు కేంద్రం ఇటీవల చాలా సార్లు ఎగుమతుల పాలసీని సవరించింది. ఈ సంవత్సరం ఆగస్టులో ఉల్లి ఎగుమతులపై 40 శాతం కస్టమ్స్ పన్ను కూడా విధించింది.

Also read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల!

#cancelled #onions #trading #export
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe