Paralympics 2024 : పారాలింపిక్స్ (Paralympics) లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి పతకాలు సాధిస్తున్నారు. ఈసారి రికార్డ్ స్థాయిలో మెడల్స్ వచ్చాయి. తాజాగా మరో పతకం వచ్చింది. జూడో పురుషుల 60 కేజీల జే1 విభాగంలో కపిల్ పర్మార్ (Kapil Parmar) కాంస్యం దక్కించుకున్నారు. దీంతో పారాలింపిక్స్‌లో ఇండియా (India) ఖాతాలో 25వ పతకం వచ్చి చేరింది. భారత్‌కు ఇప్పటివరకు 5 బంగారు, 9 రజతం, 11 కాంస్యాలు వచ్చాయి.
అంతకు ముందు క్లబ్ త్రో ఫైనల్ మ్యాచ్‌లో ధరంబీర్ సింగ్ బంగారు పతకాన్ని, ప్రణవ్ సుర్మా (Pranav Surma) రజత పతకాన్ని గెలుచుకున్నారు. అంతకుముందు ఆర్చర్ హర్విందర్ సింగ్ స్వర్ణం, షాట్ పుటర్ సచిన్ సర్జేరావు రజతం సాధించారు. క్రీడల్లో 7వ రోజు భారత ఆటగాళ్లు 2 స్వర్ణాలు, 2 రజత పతకాలు సాధించారు.
Also Read : HYDRA: ఆ వ్యూ ఉన్న ఇళ్లు వద్దే వద్దు.. హైడ్రాతో మారిన హైదరాబాదీల ట్రెండ్!