నేటితో లోక్‌సభ ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఈరోజు సాయంత్రం 6.30 PM గంటలకు విడుదల కాబోయే ఎగ్జిట్ పోల్స్ కోసం దేశప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇండియా కూటమి సమావేశమైంది. ఈ మేరకు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ' ఇండియా కూటమి పార్టీలు సమావేశమయ్యాయి. ముందస్తు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా బీజేపీని, దాని వ్యవస్థను బహిర్గతం చేయాలని నిర్ణయించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధించి అనుకూల, ప్రతికూల అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత.. ఈరోజు సాయంత్రం టీవీ ఛానల్ డిబేట్లలో ఇండియా కూటమి పార్టీలు పాల్గొనాలని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారని' పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.
Also Read: కేజ్రీవాల్ పిటిషన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్.!