ఈ సినిమాలు చూస్తే దేశభక్తి ఉప్పొంగుతుంది.. తప్పక చూడాల్సిన చిత్రాలివే!

Independence Day Special Movies | ఇండిపెండెన్స్‌ డే వస్తుందంటే అందరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది. అదే సమయంలో దేశభక్తి సినిమాల గురించి కూడా విపరీతంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఖడ్గం, ఠాగూర్, అల్లూరి సీతారామరాజు, భారతీయుడు,సర్ధార్ పాపారాయుడు సినిమాలు తెలుగువారి మనసులకు చాలా దగ్గరైన చిత్రాలు.

ఈ సినిమాలు చూస్తే దేశభక్తి ఉప్పొంగుతుంది.. తప్పక చూడాల్సిన చిత్రాలివే!
New Update

Independence Day Special Movies (Patriotic films):  స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) వచ్చేస్తోంది.. ఆగస్టు 15కు దేశం ముస్తాబవుతుంది. స్కూళ్లు, కాలేజీలతో పాటు వీధివీధినా జెండా ఎగిరే సమయం అది. ఆగస్టు 15 వస్తుందంటే దేశభక్తి సినిమాల గురించి కూడా చర్చ మొదలువుతుంది. ముఖ్యంగా ఆ రోజు అందరికి సెలవు కావడంతో ఇంటిల్లిపాది చూసేలా టీవీల్లో దేశభక్తి సినిమాలు కనిపిస్తుంటాయి. మరి తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా మెచ్చిన దేశభక్తి సినిమాలేంటో తెలుసా?

Independence Day Special Movies ఖడ్గం

1) ఖడ్గం (Khadgam):
ఈ సినిమా చూడని వారి సంఖ్య తెలుగునాట చాలా తక్కువగా ఉంటుంది. స్వాతంత్ర్య దినోత్సవానికి దాదాపు ప్రతిఏటా టీవీల్లో కనిపించే సినిమా ఇది. 2002లో రిలీజైన ఈ చిత్రం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌ సినిమానే. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి, సంగీత, కిమ్ శర్మ, షఫీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సుంకర మధుమురళి కార్తికేయ మూవీస్ పతాకంపై నిర్మించారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఐదు నంది అవార్డులు అందుకున్న సినిమా ఇది. 72రోజుల షూటింగ్ ,రెండున్నర కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సినీ లవర్స్‌కి మోస్ట్ ఫెవరెట్‌. ఇందులో ప్రతీ పాత్రా ఓ అద్భుతమే. పోలీస్‌ ఆఫీసర్‌గా శ్రీకాంత్‌ నటనకు 100కు 100 మార్కులు పడ్డాయి. ఇక ప్రకాశ్‌రాజ్‌ నటన నిజంగా వండర్‌. ఒక్క ఛాన్స్‌ ఒక్క ఛాన్స్‌ అంటూ హీరో వేషాల కోసం నటించే పాత్రలో రవితేజ జీవించేశాడు.

Independence Day Special Movies భారతీయుడు

2) భారతీయుడు (Bharateeyudu):
ఇది స్ట్రెయిట్‌ తెలుగు సినిమా కాకపోయినా మనవాళ్లు ఎక్కువగా ఇష్టపడే చిత్రాల్లో ఇది కూడా ఒకటి. భారతీయుడు సినిమా డైరెక్ట్ చేసిన శంకర్‌కి సెల్యూట్‌ కొట్టాల్సిందే. దేశాన్ని వెనక్కి నెడుతున్న 'లంచం'పై కమల్‌ హాసన్‌ చేసిన యుద్ధం ఈ సినిమా. తప్పు చేస్తే సొంత కొడుకైనా వదలని పాత్రలో కమల్‌హాసన్‌ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. దేశం గర్వించదగ్గ నటుల్లో కమల్‌ ముందు వరుసలో ఎందుకు ఉంటారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. 'పచ్చని చిలుకలు తోడుంటే' అంటూ ఈ సినిమాకు సంగీతం అందించారు లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌రెహ్మన్‌. ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం కూడా ఓ ట్రాన్స్‌లోకి వెళ్లిపోతాం. డైరెక్టర్‌ శంకర్‌ని స్టార్‌ డైరెక్టర్‌గా మార్చిన సినిమా ఇదే. ఆయన తీసుకున్న 'లంచం' సమస్య అంశం ఇప్పటికీ దేశంలో సజీవంగానే ఉంది. అందుకే ఈ సినిమా 1996లోనే రిలీజైనా ఇప్పటికీ కూడా ప్రజలు కళ్లు తిప్పుకోకుండా చూస్తారు.

publive-image అల్లూరి సీతారామరాజు

3) అల్లూరి సీతారామరాజు (Alluri Sitharamaraju):
స్వాతంత్ర్య సమరంలో విప్లవాగ్ని రగిలించిన వీరుడు అల్లూరి సీతారామరాజు. బయోపిక్‌లు ఎక్కువగా లేని కాలంలో అల్లూరి జీవితాన్ని వెండితెరపై చూపించింది టాలీవుడ్. ఎన్టీఆర్‌ లాంటి టాప్‌ హీరోలు ఈ సినిమాలో నటించడానికి వెనకడుగు వెయగా.. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ సినిమాలో నటించడానికి ముందుకొచ్చారు. కృష్ణ స్టామినా ఏంటో దేశానికి తెలిసి వచ్చేలా చేసిన సినిమా ఇది. తాను ఎవరికి తక్కువ కాదని.. తనకంటూ ఓ బ్రాండ్‌ ఉందని కృష్ణ ఈ సినిమాతోనే నిరూపించుకున్నారు. అందుకే తెలుగు వారు అల్లూరి అంటే కృష్ణనే గుర్తుతెచ్చుకుంటారు. అంతలా అల్లూరి పాత్రకు న్యాయం చేశారు కృష్ణ. 1974 మే 1న విడుదలైన ఈ సినిమా తెలుగులో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన తొలి సినిమా స్కోప్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. 'తెలుగువీర లేవరా' అంటూ కృష్ణ గిరిజనుల్లో దేశభక్తిని రేపుతుంటే ఈ సినిమా చూస్తున్న ప్రజలు కూడా కూర్చున్న ప్లేస్‌లో ఉండలేపోతారు. ప్రముఖ గేయ రచయిత శ్రీ శ్రీ అందించిన లిరిక్స్‌ అలాంటివి మరి. అల్లూరి సీతారామరాజు సినిమా సూపర్ స్టార్ తన స్వీయ నిర్మాణ సంస్థ పద్మాలయ సంస్థపై నిర్మించగా.. సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు వి.రామచంద్రరావు అకాల మరణం చెందారు. అప్పటికే 70శాతం సినిమా పూర్తవగా.. మిగిలిన శాతాన్ని కే.యస్.ఆర్. దాస్ డైరెక్ట్ చేశారు.

publive-image ఠాగూర్‌

4) ఠాగూర్‌ (Tagore):
తెలుగు సినిమాను ఫెక్షన్‌ చిత్రాలు ఏలుతున్న సమయంలో రిలీజైన 'ఠాగూర్‌' సమాజంలో తిష్ట వేసుకొని ఉన్న అనేక సమస్యలను ఎత్తిచూపింది. అప్పటికే 'ఇంద్ర'లాంటి ఇండస్ట్రీ హిట్‌తో దూకుడు మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. మంచి సోషల్‌ ఎలిమెంట్ ఉన్న సబ్జెట్‌ని ఎంచుకోని తాను ఎందుకు నంబర్‌ వన్‌ హీరోనో నిరూపించాడు. ACF(యాంటి కర్‌ప్షన్‌ ఫోర్స్)ను నడిపిస్తున్న ఓ కాలేజీ ఫ్రొఫెసర్‌గా నటించిన చిరంజీవి సమాజాన్ని పట్టిపీడిస్తున్న 'లంచగొండితనం'పై వెండితెర వేదికగా రణభేరి మోగించిన సినిమా ఇది. తమిళంలో మురుగుదాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులోకి రీమేక్‌ చేయగా.. వినాయక్‌ దర్శకత్వం వహించారు. 2002లో రిలీజైన ఈ సినిమాకు మ‌ణిశర్మ స్వ‌రాలు స‌మకూర్చారు.

publive-image సర్ధార్ పాపారాయుడు

5) సర్ధార్ పాపారాయుడు (Sardar Papa Rayudu):
దేశం కోసం పోరాడిన అమర వీరుల చరిత్రను, త్యాగాలను గుర్తుచేసే సినిమాల్లో సీనియర్‌ ఎన్టీఆర్‌ అదరహో అనిపించారు. ఎన్టీఆర్‌కు పొలిటికల్‌ ఎంట్రీకి మైలేజీని ఇచ్చిన మూవీగా ఈ చిత్రాన్ని విశ్లేషిస్తుంటారు. శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో క్రాంతి కుమార్ నిర్మించగా, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు . ఇందులో ఎన్‌టిఆర్‌, శ్రీ దేవి, శారద ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. 1980లో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రం ఇది. కొన్ని కేంద్రాల్లో దాదాపు 300 రోజులు ఆడిన సినిమా.

Also Read: స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఈ ప్రత్యేకమైన స్వీట్లను మీ పిల్లల కోసం ట్రై చేయండి…!!

#77th-independence-day #bharateeyudu-movie #independence-day-2023 #independence-day-special #alluri-sitharamaraju-movie #khadgam-movie #independence-day-special-patriotic-films #independence-day-special-movies #independence-best-movies #independenceday2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి