Modi independence day speech: ఎర్రకోటపై పదోసారి ప్రధాని మోదీ.. ఏం అన్నారంటే?

మణిపూర్ హింసతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్నారు మోదీ. ఎర్రకోట వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మణిపూర్ అంశాన్ని మోదీ ప్రస్తావించారు. త్వరలోనే అక్కడశాంతి నెలకొంటుదని తెలిపారు. కరోనాసంక్షోభం తరువాత ప్రపంచానికి భారత్ పై సరికొత్త విశ్వాసం నెలకొందని మోదీ చెప్పారు. 10 ఏళ్ల క్రితం రాష్ట్రాలకు రూ. 30 వేల కోట్లు ఇస్తే.. ఇప్పుడు రాష్ట్రాలకు రూ. 100 కోట్లు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులు ఈ మూడింటిని వదిలించుకోవాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

Modi independence day speech: ఎర్రకోటపై పదోసారి ప్రధాని మోదీ.. ఏం అన్నారంటే?
New Update

ఎర్రకోట వేదికగా మణిపూర్‌ అంశాన్ని ప్రస్తావించారు మోదీ. దేశ ప్రజలంతా మణిపూర్‌కి అండగా ఉంటారన్నారు. మణిపూర్‌ లో శాంతి స్థాపనకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్నారు. మణిపూర్‌తో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగిందని చెప్పుకొచ్చారు మోదీ. మణిపూర్‌లో కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.

అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులు ఈ మూడింటిని వదిలించుకోవాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదేనన్నారు మోదీ. ఎంతోమంది బలిదానాలతో స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. దేశ ప్రజలను, దేశాన్ని గౌరవించేవారికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మోదీ. 140కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. ఇక వెయ్యి ఏళ్ల బానిసత్వానికి తెరదించుతూ 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు మోదీ. అమృతోత్సవ్‌తో మనం చేపట్టే చర్యలు వెయ్యి ఏళ్లపాటు స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. ప్రపంచదేశాలన్నీ భారత్‌వైపే చూస్తున్నాయని చెప్పారు మోదీ. పదేళ్లుగా దేశ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందన్నారు. మనదేశంపై ప్రపంచానికి విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. డిజిటల్‌ ఇండియా దిశగా దేశం దూసుకెళ్తుందని కొనియాడారు మోదీ. దేశంలో యువశక్తి అద్భుతంగా ఉందన్నారు. మన యువశక్తి, సామర్థ్యాలపై భరోసా ఉందని నమ్మకం వ్యక్తం చేశారు ప్రధాని. అవకాశాలకు హద్దుల్లేవని చెప్పారు.

జన ఔషధి కేంద్రాలపై కీలక వ్యాఖ్యలు:

ఎర్రకోట ప్రసంగంలో జన ఔషధి కేంద్రాలపై కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. జన ఔషధి కేంద్రాలు 10 వేల నుంచి 25 వేలకు పెంచుతామన్నారు. జన ఔషధితో కేంద్రానికి చౌకగా మందులు లభిస్తాయని చెప్పారు. ఇక గ్రామాల వినిమయ శక్తి పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని తెలిపారు. మధ్యతరగతి, వేతన జీవులకు ఆదాయపు పన్ను పరిమితి పెంపుతో ఊరట కలుగుతుందన్నారు ప్రధాని.

10ఏళ్ల క్రితం రాష్ట్రాలకు రూ.30వేల కోట్లు ఇస్తే.. ఇప్పుడు రాష్ట్రాలకు రూ.100 కోట్లు ఇవ్వగలుగుతున్నామన్నారు మోదీ. 

➼ జీ-20 సదస్సు నిర్వహించే అవకాశం మనకు దక్కిందని.. ఈ సదస్సుతో ప్రపంచానికి మన సామర్థ్యాన్ని చాటుతున్నామని చెప్పారు మోదీ.

నారీ శక్తిపై ప్రసంశలు:

ఇప్పుడు దేశం చాలా సురక్షితంగా ఉందని.. తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందని చెప్పారు మోదీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు ప్రధాని. దేశాభివృద్దిలో మహిళా శక్తిదే కీలక పాత్ర అని చెప్పుకొచ్చారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందు వరుసలో ఉన్నారని మోదీ అభిప్రాయపడ్డారు. 2కోట్ల మంది మహిళల్ని లక్షాధికారుల్ని చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. మహిళా స్వయం సహాయిక సంఘాలకు డ్రోన్లతో శిక్షణ ఇస్తామన్నారు. అటు కరోనా తర్వాత ప్రపంచానికి భారత్‌ మిత్రుడిగా మారిందని చెప్పారు మోదీ. ప్రపంచ సంక్షేమాన్ని కూడా మనం కోరుకుంటున్నామని తెలిపారు.

ప్రోగ్రెస్‌ కార్డు:

ఎర్రకోటపై పదేళ్ల ఎన్డీఏ ప్రోగ్రెస్‌ కార్డును ఆవిష్కరించారు మోదీ. జల్‌ జీవన్‌ మిషన్‌, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలతో ఎంతో మందికి మేలు కలుగుతుందని చెప్పారు. తొలి ఐదేళ్లలో 12.5 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపామని.. వన్‌ ర్యాంక్‌ వన్ పెన్షన్‌కు రూ.70వేల కోట్లు కేటాయించినట్టు చెప్పుకొచ్చారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచం మొత్తం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోందన్నారు మోదీ. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.



77వ స్వాతంత్ర్య దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటోంది దేశం. రాజ్‌ఘాట్‌ వద్ద నివాళి అర్పించారు మోదీ. ఉదయం 7.06 నిమిషాలకు రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి ప్రధాని నివాళి అర్పించారు. తర్వాత 7.18కి ఎర్రకోటకు చేరుకున్నారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని మోదీ ఆవిష్కరించారు. ఆ వెంటనే భారత వైమానిక దళానికి చెందిన మార్క్-III ధ్రువ్ అనే రెండు హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఇక స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానిగా నరేంద్ర మోదీ పదో సారి ప్రసంగించారు. మరోవైపు ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 30 వేల నుంచి 40 వేల వరకు మంది హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,800 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించారు.

#independenceday2023 #happyindependence-day #pm-modi #independence-day-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe