IND vs ZIM: భారత్-జింబాబ్వే జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో నాలుగో మ్యాచ్ హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ సిరీస్లో తిరుగులేని ఆధిక్యం సాధిస్తుంది. జింబాబ్వే కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో పునరాగమనం చేయాలనుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా గెలుపొందాలనే పట్టుదలతో ఇరు జట్లు రంగంలోకి దిగనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో హరారే పిచ్ ఎవరికి సహకరించే అవకాశం ఉంది. అలాగే, మ్యాచ్ జరిగే రోజు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..IND vs ZIM: జింబాబ్వేతో టీమిండియా కీలక T20 నేడు.. వాతావరణం సహకరించేనా?
జింబాబ్వే-భారత్ మధ్య 5 మ్యాచ్ ల T20 సిరీస్ లో కీలకమైన నాలుగో మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. అక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం, మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశం లేకపోలేదు.
Translate this News: