IND VS SA: తెలుగు కుర్రాడికి షాక్‌.. మూడో వన్డే నుంచి ఔట్.. తుది జట్టు ఇదే!

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మూడో వన్డేలో తెలుగు కుర్రాడు తిలక్‌వర్మ ఆడకపోవచ్చు. రెండో వన్డేలో 30 బంతుల్లో 10 పరుగులే చేసిన తిలక్‌ వర్మ స్థానంలో రజత్ పాటిదార్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

New Update
IND VS SA: తెలుగు కుర్రాడికి షాక్‌.. మూడో వన్డే నుంచి ఔట్.. తుది జట్టు ఇదే!

ఇండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీరిస్‌ 1-1తో సమం కావడంతో రేపు(డిసెంబర్ 21) జరగనున్న మూడో టీ20 ఫైనల్‌గా మారింది. ఈ సీరిస్‌ డిసైడింగ్‌ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. తొలి మ్యాచ్‌లో ఇండియా అన్ని విభాగాల్లో రాణిస్తే.. రెండో వన్డేలో భారత్ ప్లేయర్లు తేలిపోయారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండిటిలోనూ ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ ఆటపై విమర్శలు వ్యక్తమయ్యాయి. 30 బంతులు ఆడిన తిలక్ కేవలం 10 పరుగులే చేయడం విమర్శలకు దారి తీసింది. దీంతో మూడో వన్డేలో తిలక్‌ను బెంచ్‌కే పరిమితం చేయాలని జట్టు నిర్ణయించుకున్నట్టు సమాచారం.

తిలక్‌, రుతురాజ్‌ ఫ్లాప్:
జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్‌ రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ పేలవమైన సిరీస్‌ను కలిగి ఉన్నాడు. వరుసగా రెండు సింగిల్ డిజిట్ స్కోర్‌లను నమోదు చేశాడు. అయితే ప్రస్తుత భారత జట్టులో మరో ఓపెనర్‌ లేడు. దీంతో రుతురాజ్‌ తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. అటు తిలక్‌ కూడా ఫెయిల్ అవుతుండడంతో అతని స్థానంలో రజత్ పాటిదార్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్లేయింగ్‌-11లో సంజూ శాంసన్తన స్థానాన్ని నిలుపుకోవచ్చు. అటు బౌలింగ్‌ యూనిట్‌లో మార్పులు చేయకపోవచ్చు. ఇద్దరు స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌తో పాటు పేసర్లు అర్ష్‌దీప్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ బౌలింగ్‌ దళంలో ఉన్నారు.

భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రజత్ పటీదార్, KL రాహుల్ (C/WK), సంజు శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

Also Read: ‘దండం పెట్టాల్సింది మీకు కదా బ్రో..’ ఆర్‌సీబీ టీమ్‌పై ట్రోలింగ్‌!

WATCH:

Advertisment
తాజా కథనాలు