Suryakumar Yadav: 'వాడు కొడితే అలా ఉంటుంది.. ఇలా ఉంటుందని ప్రత్యర్థులు చెప్పడమే కానీ.. వాడు ఎలా కొడతాడో వాడికి కూడా తెలియదు..' అదే సూర్యాభాయ్ స్టైల్. వన్డేల్లో ఆటలో అరటిపండే కావొచ్చు.. టీ20ల్లో మాత్రం పోకిరిలో పండుగాడి కంటే డేంజర్. బాల్ ఎక్కడేసినా అది పడేది మాత్రం స్టాండ్స్‌లోనే..! నిలబడి స్వీప్ చేసినా.. కుర్చొని టచ్ చేసినా.. బెండై కట్ చేసినా.. డ్యాన్స్ చేసి బాదినా.. కిందపడి దొర్లి, పాములా పాకుతూ ఫ్లిక్ చేసినా.. రిజల్ట్ మాత్రం బౌండరీనే బాసూ 😎! వరల్డ్‌కప్ ఫైనల్‌లో చెత్తాటకు విమర్శలు మూటగట్టుకున్న సూర్యకుమార్‌యాదవ్(SuryaKumar Yadav).. తన ఫెవరేట్ ఫార్మెటైన టీ20ల్లో మాత్రం ప్రత్యర్థులను పేకాట ఆడేస్తున్నాడు. అంతకముందు ఆస్ట్రేలియాపై జరిగిన టీ20 సిరీస్‌లో దుమ్ములేపిన స్కై.. తాజాగా దక్షిణాఫ్రికాపై సిరీస్‌లో (India vs South Africa) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సెంచరీతో సఫారీలను సహారా ఏడారిలో పడేశాడు. మూడో టీ20లో సెంచరీ చేసి సిరీస్‌ను సమం చేసిన సూర్యభాయ్ ఖాతాలో బోలేడు రికార్డులు వచ్చి పడ్డాయి.
ఎన్నో రికార్డులు:
దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో 55 బంతుల్లోనే సెంచరీ చేసిన సూర్యకుమార్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది నాలుగోది. ఇందులో మూడు సెంచరీలు విదేశీ గడ్డపైనే ఉండడం మనోడి స్పెషాలిటీ. ఇక నాన్-ఓపెనర్‌గా బరిలోకి దిగి టీ20 ఫార్మెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు స్కై. నాన్-ఓపెనర్‌గా సచిన్ (Sachin Tendulkar) టెస్టుల్లో 51 సెంచరీలు చేస్తే.. నాన్-ఓపెనర్‌గా వన్డేల్లో కోహ్లీ 50 హండ్రెడ్స్ చేశాడు. ఇటు నాన్-ఓపెనర్‌గా అంతర్జాతీయ టీ20ల్లో సూర్య నాలుగు సెంచరీలు చేశాడు. అటు ఓవర్‌సీస్ మ్యాచ్‌ల్లో భారత్ నుంచి టీ20 కెప్టెన్‌గా సూర్య మాత్రమే సెంచరీ చేశాడు.
అంతేకాదు అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో 20కు పైగా పరుగులు నాలుగు సార్లు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు సూర్యకుమార్. టీమిండియా నుంచి ఒకే ఓవర్‌లో 20కు పైగా రన్స్ ఎక్కువ సార్లు చేసిన వారిలో సూర్య సెకండ్ ప్లేస్‌కు వచ్చాడు. ఫస్ట్ ప్లేస్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నాడు. అతను ఏకంగా 5సార్లు ఈ ఫీట్ సాధించాడు. అటు అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై జట్టుపై అత్యధిక యావరేజ్ కలిగిన ప్లేయర్‌గా నిలిచాడు స్కై. సౌతాఫ్రికాపై సుర్యకుమార్ యావరేజ్ 68గా ఉంది. అటు రన్ మెషీన్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్థాన్‌పై 81యావరేజ్ కలిగి ఉన్నాడు. అటు టీ20ల్లో భారత్ నుంచి ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న రెండో ఆటగాడు సూర్యకుమార్. తాజాగా దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న సూర్యకుమార్.. ఇప్పటికీ నాలుగు సార్లు ఈ అవార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఏడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న కోహ్లీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు.
Also Read: జెర్సీ నంబర్-7 రిటైర్స్ 🙇♀️.. బీసీసీఐ నిర్ణయంతో ధోనీ ఫ్యాన్స్ ఎమోషనల్ 😰..!
WATCH: