/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/booky-my-show-jpg.webp)
IND vs PAK ticket sale for World Cup 2023 : ఇండియాలో క్రికెట్‌కి ఉండే క్రేజ్ మరే ఇతర ఫీల్డ్‌కు ఉండదు.. సినిమాలైనా క్రికెట్ తర్వాతే.. టికెట్ సేల్స్(Ticket sales) పెడితే సైట్లు క్రాష్ ఐపోతాయి.. నిమిషాల వ్యవధిలో టికెట్లు సేల్ ఐపోతాయి.. అందులోనూ వరల్డ్ కప్(world cup) సీజన్ కదా.. టికెట్ల కొనుగోలుకు ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు అభిమానులు.. డబ్బులు కూడా రెడీ చేసుకున్నారు. ఇండియా-పాకిస్థాన్(India versus Pakistan) మ్యాచ్ టికెట్ల అమ్మకాల టైమ్ తెలుసుకున్నారు.. ఇంటర్‌నెట్‌లో మిగిలిన ట్యాబ్‌లన్ని క్లోజ్ చేసి పడేసి కేవలం 'బుక్ మై షో'(book my show) మాత్రమే ఓపెన్ చేసి కుర్చున్నారు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో టికెట్ విక్రయాలు జరుపుతున్నది 'బుక్ మై షో'నే. అయితే టికెట్ల బుకింగ్ స్టార్ట్ అయిన కొద్ది సేపటికే సైట్ క్రాష్(Site crash) అయ్యింది. అభిమానులు తలలు పట్టుకున్నారు.
1 like = 1 slap on Book My Show, BCCI and Rohit Sharma
1 RT = 100 Slaps#BookMyShow pic.twitter.com/FQTfN8iwNj
— Aarav (@sigma__male_) August 29, 2023
ఆరు గంటలు వెయిటింగ్:
ఎలాగైనా టికెట్ సంపాదించాలని ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో పడిగాపులు కాస్తుండగా.. బుక్ మై షో నుంచి వచ్చిన ఓ మెసేజ్ వారికి చిర్రెత్తించింది. ఆరు గంటలు ఆగాలని ఒకరికి.. రెండు గంటలు ఆగాలని మరికొందరికి మెసేజ్‌లు వచ్చాయి. మీరు వర్చువల్ క్యూలో ఉన్నారని... వెయిట్ చేయాలని ఆ మెసేజ్ సారాంశం. సరేలే అని కోపం తగ్గించుకోని వెయిట్ చేసిన ఆ అభిమానులకు లాస్ట్‌లో దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయితే అవ్వలేదు కానీ.. కోపం మాత్రం కట్టలు తెంచుకుంది. టికెట్స్ సోల్డ్ అవుట్ అని మెసేజ్ కనిపించింది. ఇంకేముంది ఒళ్లు మండిపోయింది.. ఇంత సేపు వెయిట్ చేయించి టికెట్లు ఐపోయయని చెబుతావా అంటూ ఆగ్రహంతో చేతికి పని చెప్పారు ఫ్యాన్స్. అంటే కీబోర్డుకు, ఫోన్‌లోని కీప్యాడ్‌కి పని చెప్పారన్నమాట.
Kudos to @BCCI and @bookmyshow for messing the ticketing process.#CricketTwitter #BookMyShow pic.twitter.com/yjJ9y7DkFm
— Vibhor (@dhotedhulwate) August 30, 2023
బుక్ మై షో టార్గెట్‌గా సోషల్‌మీడియాలో దారుణ ట్రోలింగ్:
సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌లోకి లాగిన్ అయ్యారు. బుక్ మై షోని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తమకు జరిగిన ఎక్స్‌పిరియన్స్‌ని స్క్రీన్‌షాట్స్ రూపంలో షేర్ చేస్తూ బుక్ మై షోపై విరుచుకుపడ్డారు. ఇంత మోసం చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. మరికొంత మంది బుక్ మై షో వాడి అడ్రెస్ కావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక భారత్ వర్సెస్ పాక్ వరల్డ్ కప్ ప్రీ సేల్ టికెట్లు గంటలోనే అమ్ముడుపోయాయి. ఈ మ్యాచ్ అక్టోబర్ 14న గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఇప్పటికే అహ్మదాబాద్‌లో హోటల్ రూమ్స్‌ని లక్షలు ఖర్చు పెట్టి మరి బుక్ చేసుకున్నారు. ఇండియా-పాక్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.. అందులోనూ వరల్డ్ కప్.. అది కూడా ప్రపంచంలోని బిగెస్ట్ క్రికెట్ స్టేడియంలో కదా.. ఇక ఏ రేంజ్ మ్యాచ్ ఫీవర్ ఉంటుందన్నది మీరే అర్థం చేసుకోవచ్చు.
Shame on Book my show 😞#BookMyShow pic.twitter.com/MA7hspwCMt
— Rowan 𝕏 (@JustLikeGon) August 29, 2023
ALSO READ: అందరి లెక్కలు తేల్చేసిన రోహిత్ శర్మ.. గట్టిగా ఇచ్చిపడేశాడుగా..!