Ind vs Eng Test Series : సిరీస్ పట్టేస్తారా? రాంచీలో నాలుగో టెస్ట్ మ్యాచ్.. భారత్ బౌలింగ్.. 

ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రాంచీలో  నాలుగో మ్యాచ్ లో తలపడుతుంది భారత్. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. మొదటి మూడు టెస్టుల్లోనూ రెండు గెలిచి ఊపు మీద ఉన్న భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలవాలని చూస్తోంది. 

New Update
Ind vs Eng Test Series : సిరీస్ పట్టేస్తారా? రాంచీలో నాలుగో టెస్ట్ మ్యాచ్.. భారత్ బౌలింగ్.. 

Ind vs Eng : భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్(Test Series) లో కీలక పోరుమొదలైంది. హైదరాబాద్(Hyderabad), విశాఖపట్నం(Visakhapatnam), రాజ్‌కోట్‌(Rajkot) ల తర్వాత ఇప్పుడు భారత్, ఇంగ్లండ్(Ind vs Eng) మధ్య టెస్టు సిరీస్ రాంచీకి చేరుకుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో నేటి నుంచి ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 2019 తర్వాత తొలిసారి టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు ఈ గ్రౌండ్ కి వచ్చిన టీమ్‌ఇండియా(Team India) ఇక్కడ సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.  అయితే విశాఖపట్నం, రాజ్‌కోట్‌లలో తిరిగి పుంజుకుని సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. అదే సమయంలో, ఇంగ్లండ్ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. 

Also Read : దీన్ని కొట్టే కంపెనీ ఏదైనా ఉందా? ఒక్క షేర్ లక్షన్నర! MRF రికార్డ్!!

స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) లేకుండానే టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో అడుగుపెట్టింది. సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 15 వికెట్లు తీసిన బుమ్రాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. దీంతో అతడి స్థానంలో ఏ ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం దక్కుతుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. రకరకాలా ఊహాగానాల తరువాత బెంగాల్ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభించింది.

జైస్వాల్ మరో డబుల్‌ కొడతాడా..?

ఈ టెస్టు సిరీస్‌(Ind vs Eng Test Series) లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు డబుల్ సెంచరీలతో దూసుకుపోతున్నాడు. 545 పరుగులతో సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాంచీ టెస్టులో అతను చెలరేగితే ఇంగ్లండ్ మళ్లీ కష్టాల్లో పడటం ఖాయం. రాజ్‌కోట్‌లో సెంచరీ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు ప్లస్ అవుతుంది. సర్ఫరాజ్ అరంగేట్రం టెస్టులోనే రెండు అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు. గిల్, రజత్ పాటిదార్ వైఫల్యాలు టీమ్ ఇండియాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తల్లి అనారోగ్యంతో మూడో టెస్టు నుంచి వైదొలిగిన అశ్విన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతనితో పాటు జడేజా, కుల్దీప్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. మొత్తంగా చూసుకుంటే టీమిండియా మంచి ట్రాక్ లోనే ఉందని చెప్పొచ్చు. 

తుది జట్ల కూర్పు ఇదే..

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), యశ్స్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురైల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ : బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫాక్స్, ఆలీ రాబిన్సన్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.

Watch This Interesting Video :

Advertisment
తాజా కథనాలు